
గాజా నగరం: గాజా నగరాన్ని పూర్తి స్థాయిలో స్వా«దీనం చేసుకునేందుకు ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. షరతులకు అంగీకరించి, లొంగిపోకుంటే హమాస్‌కు నరక ద్వారాలు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. గాజా్రస్టిప్‌లో ఇప్పటికే శిథిలాల దిబ్బలుగా మారిన రఫా, బెయిట్ హనౌన్ నగరాలకు పట్టిన గతే గాజా నగరానికీ పడుతుందని శుక్రవాం ‘ఎక్స్’ద్వారా అలి్టమేటమ్ జారీ చేశారు.
మిగతా బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, హమాస్ ఆయుధాలను వదిలివేయాలని ఆయన మరోమారు డిమాండ్ చేశారు. అయితే, బందీల విడుదలకు సిద్ధమని ప్రకటించిన హమాస్..పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయకుండా ఆయుధాలను త్యజించడం మాత్రం అసాధ్యమని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తి స్థాయి ఆక్రమణ కోసం సన్నద్ధతా చర్యలను మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సైనిక చర్య మొదలవుతుందని భావిస్తున్నారు. ఇలా ఉండగా, శుక్రవారం గాజా నగరంపై జరిగిన దాడుల్లో కనీసం 17 మంది చనిపోయారని స్థానిక షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
గాజా స్ట్రిప్ ప్రాంతంలో గట్టిపట్టున్న హమాస్ మిలటరీకి, పాలనకు గాజా నగరమే ఆయువు పట్టు. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల నుంచి హమాస్ శ్రేణులను గాజాలోని భూగర్భ సొరంగాలు పెట్టని కోటలుగా ఉన్నాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. బంకర్లలో ఉన్న ఈ షెల్టర్లలోనే వేలాదిగా పౌరులు, కీలక మౌలిక, ఆరోగ్య సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు అనుమానిస్తోంది. హమాస్‌ను ఓడించడం, బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడం నగరాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం ద్వారానే సాధ్యమని నెతన్యాహూ ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. 22 నెలల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి 251 మందిని హమాస్ శ్రేణులు బందీలుగా పట్టుకెళ్లింది. ఇప్పటికీ ఇంకా సజీవులైన 20 మంది సహా మొత్తం 50 మందిని విడుదల చేయాల్సి ఉంది.