ఇజ్రాయిల్-హమాస్‌ల మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా నిరసన సెగ ఎదురైంది. ట్రంప్ ప్రసంగించే సమయంలో ఇద్దరు ఎంపీలు ట్రంప్ ప్రసంగానికి అడ్డుతగిలారు.
స్లోగాన్స్‌తో ట్రంప్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. ఇలా ట్రంప్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడటంతో ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి వారిని మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లిపోయారు.
2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ కిడ్నాప్ చేయబడినప్పటి నుండి వారు బందీలుగా పట్టుకున్న చివరి సజీవ బందీలను ఇజ్రాయెల్‌కు తిరిగి పంపడాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. హమాస్‌తో తొలి దశ ఒప్పందంలోని ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలలపై వారు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’


