జెరూసలేం: హమాస్ ఈ వారంలో రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేసిన అవశేషాలు బందీలవి కావని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న 30 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను గాజాలో అందజేసింది. ప్రతిగా శుక్రవారం హమాస్ శ్రేణులు ముగ్గురు బందీల అవశేషాలను రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఇజ్రాయెల్ అధికారులు పరీక్షలు జరిపి అవి బందీలవి కావని తేల్చారు.
ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ శనివారం ప్రకటించారు. ఆ అవశేషాలు ఎవరివనే విషయం తేలాల్సి ఉంది. అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక, 17 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. చిట్టచివరిగా 11 మంది మృతదేహాల అప్పగింత ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇజ్రాయెల్ అందజేసిన 225 మంది పాలస్తీనియన్ల మృతదేహాల్లో 75 మందిని మాత్రమే కుటుంబాలు గుర్తించాయని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.


