ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం | US Plane Crash Ex Nascar Driver And His Family Among 7 in US Plane Crash | Sakshi
Sakshi News home page

ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం

Dec 19 2025 10:44 AM | Updated on Dec 19 2025 11:11 AM

US Plane Crash Ex Nascar Driver And His Family Among 7 in US Plane Crash

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. 

ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్  టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో  మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని  ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. 

ఎవరీ గ్రెగ్ బిఫిల్ 
రేసింగ్‌తో మక్కువతో  కరియర్‌లో  ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్‌ అని రేషింగ్‌  అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని  ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రక్ సిరీస్‌లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్‌లో ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.

రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ,  సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్‌కు నివాళులర్పించింది. రేసింగ్‌తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్‌ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement