breaking news
several died
-
ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎవరీ గ్రెగ్ బిఫిల్ రేసింగ్‌తో మక్కువతో కరియర్లో ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్ అని రేషింగ్ అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రక్ సిరీస్‌లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్‌లో ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ, సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్‌కు నివాళులర్పించింది. రేసింగ్‌తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్‌ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ❗️⚠️🇺🇸 - A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025 Oh no!! Horrible breaking news!!Greg Biffle, a NASCAR champion has gone down in a plane crash with his wife and children. Three others perished as well. One was a man and his son.Just 26 mins after takeoff the plane tried to return but crashed. pic.twitter.com/4c2ieDpQaB— Jennifer 🟥🔴🧙♀️🦉🐈⬛ 🦖 (@babybeginner) December 19, 2025 -
తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి పడవలోకి ప్రయాణికులు ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా ప్రావిన్స్ అధికారులు చెప్పారు. Andy Vermaut shares: Dozens killed as boat sinks off north coast of Mozambique: More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. https://t.co/O4MSafGYK0 Thanks. pic.twitter.com/vVehEtxG9C — Andy Vermaut (@AndyVermaut) April 7, 2024 ఈ ప్రమాదంలో అధికంగా చిన్నారులే మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితుల కారణంగా మృత దేహాలు వెతికే ఆపరేషన్ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నరని స్థానిక అధికారులు తెలిపారు. More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. Read more at: https://t.co/8lVayQMPHE — Daily Tribune (@tribunephl) April 7, 2024 -
విశాఖలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ భయంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. -
బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
భోపాల్: బాణసంచా నిలువ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా బన్మోర్ నగర్లో గురువారం జరిగింది. భారీ పేలుడుతో ఫైర్‌క్రాకర్స్ నిలువ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘గోదాంలోని గన్‌పౌడర్ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్ సిలిండర్ పేలటం వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాం. ఈ పేలుడులో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.’ అని మొరేనా కలెక్టర్ బక్కి కార్తికేయన్ తెలిపారు. గోదాం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలను మోహరించామని, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఐజీ రాజేశ్ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్‌లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్ హాలీడే ఎప్పుడంటే.. -
ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!
లక్నో: భారీ వర్షాలు, వరదలు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయి మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటావాతో పాటు ఫిరోజాబాద్, బలరాంపుర్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటావా చంద్రపురా ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. క్రిపాల్‌పుర్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందావా కే బంగ్లా గ్రామంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది. గురువారం చోటు చేసుకున్న వరుస సూసైడ్ ఎటాక్స్‌లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు. సెంట్రల్ బాగ్దాద్‌లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్న ఘటనలో 13 మంది మృతి చెందారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్తానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధానిలో నగరంలో 2017 తరువాత ఇదే అదిపెద్ద దాడి అని భావిస్తున్నారు. -
గుంటూరులో విజృంభిస్తున్న అతిసారం..8మంది మృతి
-
గుంటూరులో ఘోరకలి ; ఇప్పటికి 8మంది మృతి
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు. మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్‌లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం. -
పాతబస్తీలో కుప్పకూలిన భవనం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాతంలో హుస్సేనీ ఆలంలోని మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం శ్లాబ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. చనిపోయిన కూలీలు నంద (32), వెంకటయ్య (40)లుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారుగా గుర్తించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ... ట్రస్ట్ నిర్వాహకులు అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్థల వివాదం కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే నోటీసులిచ్చినట్లు చెప్పారు. బిల్డర్, ఇంజినీర్, సూపర్వైజర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.


