ఇజ్రాయెల్‌ దాడుల్లో.. ఇద్దరు హెజ్‌బొల్లా కమాండర్లు హతం | israel says Hezbollah commanders were eliminated precise strikes | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో.. ఇద్దరు హెజ్‌బొల్లా కమాండర్లు హతం

Oct 10 2024 4:51 PM | Updated on Oct 10 2024 7:17 PM

israel says Hezbollah commanders were eliminated precise strikes

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తాము చేసిన దాడుల్లో మరో ఇద్దరు హెజ్‌బొల్లా కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం ప్రకటించింది.  

హూలా ఫ్రంట్‌ కమాండర్‌, వందలాది క్షిపణి దాడులకు కారణమైన అహ్మద్‌ ముస్తఫా అల్‌ హజ్‌ అలీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని మీస్‌ ఎల్‌ జబాల్‌ ప్రాంతంలో హెజ్‌బొల్లా యాంటీ-ట్యాంక్‌ యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరించిన మహ్మద్‌ అలీ హమ్దాన్‌లు తమ దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. తమ దేశా పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే హెజ్‌బొల్లా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేవరకు తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

 

గతేడాది అక్టోబర్‌ 7 తేదీన హామాస్‌ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం.. ఇజ్రాయెల్‌ హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే..  హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా  ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో  పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement