హమాస్‌ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్‌ | Israel Claims to Have Found Hamas Tunnel | Sakshi
Sakshi News home page

హమాస్‌ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్‌

Jun 8 2025 9:44 AM | Updated on Jun 8 2025 10:45 AM

Israel Claims to Have Found Hamas Tunnel

జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్‌ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా  ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌ను  కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్‌ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని  విడుదల చేసింది.

గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్‌కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది.
 

ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక  దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ  సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్‌ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్‌ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. 

ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్‌ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

Advertisement
 
Advertisement
Advertisement