
పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న మాక్రాన్
మాక్రాన్ తీరుపై అమెరికా, ఇజ్రాయెల్ ఆగ్రహం
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు.
నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికా
పాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్
ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్‌ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
స్వాగతించిన హమాస్..
ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్‌ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.