టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్! | T20 World Cup Special BSNL New Data Pack | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్!

Mar 8 2026 7:29 PM | Updated on Mar 9 2026 9:23 AM

T20 World Cup Special BSNL New Data Pack

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం 16 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 4జీబీ డేటా లభిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''వరల్డ్ కప్ అంటే కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక వేడుక. పవర్ ప్లేల నుంచి చివరి ఓవర్ల వరకు చూడండి. కేవలం రూ.16కే 4జీబీ డేటా పొందండి. ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే. మ్యాచ్ ఇప్పుడు అంతరాయం లేకుండా చూడండి. ఎందుకంటే ప్రపంచ కప్ సమయం వచ్చినప్పుడు, మీ డేటా ఛాంపియన్ లాగా ఉండాలి'' అని బీఎస్ఎన్ఎల్ ఇండియా ట్వీట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement