ఇండియా, వెస్టిండీస్ మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం కూకట్‌పల్లిలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. హాలులో, పెళ్లి విందులో అతిథులతో పాటు నూతన దంపతులు మ్యాచ్ తిలకించారు.
సంగీతం శ్రవణానందం
హైదరాబాద్ లైఫ్‌స్టైల్‌లో మరో ట్రెండీ హైలైట్‌గా ‘రూట్ ఫర్ మాంగ్రోవ్స్’ లైవ్ కాన్సర్ట్ నిలిచింది. ట్రైబ్ వైబ్ ఎంటర్‌టైన్మెంట్, సిగ్నేచర్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత సంబరం.. పర్యావరణ పరిరక్షణను వినోదంతో మేళవించిన వినూత్న ప్రయత్నంగా నగరవాసులను ఆకట్టుకుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో ప్రముఖ సింగర్స్ విశాల్, శేఖర్ తమ ఎనర్జిటిక్ హిట్స్‌తో ప్రేక్షకులను ఊపేశారు.


