breaking news
India and West Indies
-
పెళ్లిలో టీ 20 మ్యాచ్
ఇండియా, వెస్టిండీస్ మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం కూకట్‌పల్లిలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. హాలులో, పెళ్లి విందులో అతిథులతో పాటు నూతన దంపతులు మ్యాచ్ తిలకించారు. సంగీతం శ్రవణానందంహైదరాబాద్ లైఫ్స్టైల్లో మరో ట్రెండీ హైలైట్‌గా ‘రూట్ ఫర్ మాంగ్రోవ్స్’ లైవ్ కాన్సర్ట్ నిలిచింది. ట్రైబ్ వైబ్ ఎంటర్టైన్మెంట్, సిగ్నేచర్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత సంబరం.. పర్యావరణ పరిరక్షణను వినోదంతో మేళవించిన వినూత్న ప్రయత్నంగా నగరవాసులను ఆకట్టుకుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ప్రముఖ సింగర్స్ విశాల్, శేఖర్ తమ ఎనర్జిటిక్ హిట్స్‌తో ప్రేక్షకులను ఊపేశారు. -
విశాఖలో భారత్-విండీస్ మూడో వన్డే రద్దు
విశాఖపట్నం: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 14న జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. హుదూద్ తుఫాన్ కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. విశాఖలో మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేవని బీసీసీఐకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తెలిపింది. తుఫాన్ విరుచుకుపడడంతో విశాఖపట్నం వణికింది. ప్రపంచ పవనాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గుడిసెలు, రేకుల షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి. భీకర గాలులకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో విశాఖ తడిసిముద్దయింది. స్టేడియం అంతా వర్షపు నీటితో ముగినిపోయింది. వర్షం లేకపోతే భారత్, వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డేను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ముందుకు వచ్చినప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో వెనక్కు తగ్గాల్సివచ్చింది. ఇప్పటికిప్పుడు వన్డే వేదికను మార్చే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సివచ్చింది.


