'మీ భద్రత మీ చేతుల్లోనే'.. సల్మాన్‌ రనౌట్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్ | Pakistan captain Salman Ali Agha gets trolled by Rawalpindi traffic police after run-out goof-up | Sakshi
Sakshi News home page

'మీ భద్రత మీ చేతుల్లోనే'.. సల్మాన్‌ రనౌట్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్

Mar 15 2026 11:01 AM | Updated on Mar 15 2026 11:09 AM

Pakistan captain Salman Ali Agha gets trolled by Rawalpindi traffic police after run-out goof-up

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా రనౌటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొంతమంది సల్మాన్ అఘాకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొంత మంది అతడిదే తప్పు అంటూ అభిప్రాయపడుతున్నారు.

అయితే తాజాగా ఈ విచిత్ర రనౌట్‌పై రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ సల్మాన్ అవుట్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. "రోడ్డు మీద అయినా, మైదానంలోనైనా మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది.

మిమ్మల్ని మీరు నమ్మండి, అప్రమత్తంగా ఉండండి. సేఫ్‌గా ఉండడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోండి"అంటూ రోడ్డపై మిరాజ్‌-సల్మాన్ ఉన్న ఫోటోను పోలీసులు షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

అసలేమి జరిగిందంటే?
ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 39వ ఓవర్ వేసిన మొహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్‌వైపు షాట్ ఆడాడు. బంతి నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.

అయితే ఇదే సమయంలో మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్‌ను పడగొట్టాడు. అప్పటికే సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్‌గా రనౌట్‌గా ప్రకటించాడు. బంగ్లా ప్లేయర్లు రనౌట్‌కు అప్పీల్ చేయడంపై సల్మాన్ అగ్రహం వ్యక్తం చేశాడు. గ్లౌవ్స్‌, హెల్మెట్ నేలకేసి కొడుతూ బంగ్లా ప్లేయర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై ఐసీసీ కూడా కూడా అతడిని మందలించింది. సల్మాన్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.
చదవండి: సన్‌రైజర్స్‌కు పాక్‌ ప్లేయర్‌ ఆడడం కష్టమే?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement