94వ ‘గ్రాండ్‌మాస్టర్‌’ మయాంక్‌ చక్రవర్తి | Mayank Chakraborty becomes Indias 94th | Sakshi
Sakshi News home page

94వ ‘గ్రాండ్‌మాస్టర్‌’ మయాంక్‌ చక్రవర్తి

Mar 15 2026 9:19 AM | Updated on Mar 15 2026 9:19 AM

Mayank Chakraborty becomes Indias 94th

భారత చెస్‌ ఆటగాడు మయాంక్‌ చక్రవర్తి కొత్త రికార్డు సృష్టించాడు. అస్సాంలోని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్‌... తాజాగా గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తొలి ప్లేయర్‌గా మయాంక్‌ కొత్త చరిత్ర లిఖించాడు.

2024లోనే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ గుర్తింపు సాధించిన మయాంక్‌ తాజాగా యూరప్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌లో... స్వీడన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ ఫిలిప్‌ లిండ్‌గ్రెన్‌పై విజయం సాధించి గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు కావాల్సిన మూడో జీఎమ్‌ నార్మ్‌ సొంతం చేసుకున్నాడు. భారత్‌ నుంచి మయాంక్‌ 94వ గ్రాండ్‌మాస్టర్‌.   

Advertisement
 
Advertisement
Advertisement