చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ | IPL 2026, SRH VS PBKS: Abhishek Sharma breaks past the mighty Chris Gayle and creates IPL history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

May 7 2026 2:26 PM | Updated on May 7 2026 2:44 PM

IPL 2026, SRH VS PBKS: Abhishek Sharma breaks past the mighty Chris Gayle and creates IPL history

సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఓపెనర్‌గా ఐపీఎల్‌లో 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్‌ను సాధించి గేల్‌ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్‌ స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 269.23గా ఉండింది. 

గత సీజన్‌ నుంచి అభిషేక్‌ ప్రత్యర్ది బౌలర్లను షేక్‌ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం ‍కూడా ఇవ్వడం లేదు.

ఈ సీజన్‌లో అభిషేక్‌ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్‌ల్లో అతడు 210.18 స్ట్రైక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్‌ దూకుడు కారణంగా హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో బలంగా నిలిచింది. 

నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్‌ భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement