ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.
ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.
ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ?


