ఐర్లాండ్ బ‌య‌ల్దేరిన టీమిండియా.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా వైభ‌వ్! | Team India Departs-For Ireland-England Tour From Chennai Airport | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్ బ‌య‌ల్దేరిన టీమిండియా.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా వైభ‌వ్!

Jun 23 2026 1:15 PM | Updated on Jun 23 2026 2:08 PM

Team India Departs-For Ireland-England Tour From Chennai Airport

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా మంగ‌ళ‌వారం చెన్నై నుంచి బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో సిరీస్‌కు ఎంపికైన న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. చెన్నై అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులో టీమిండియా బృందం ప్ర‌త్యేక‌ ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్‌కు సిద్ధం’ అన్నట్లుగా వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న స‌హ‌చ‌ర ప్లేయ‌ర్‌ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సెల్ఫీని పంచుకున్నాడు. 

ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి ఇదే తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కానుండ‌డం విశేషం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడ‌నున్న వైభ‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌నున్న అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా వైభ‌వ్ రికార్డుల‌కెక్క‌నున్నాడు. 

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఇండియా-ఏ జ‌ట్టు ట్రై సిరీస్ విజేత‌గా నిల‌వ‌డంలో వైభ‌వ్ కూడా కీల‌క‌పాత్ర పోషించాడు. శ్రీలంక‌-ఏ జ‌ట్టుతో జ‌రిగిన‌ ఫైన‌ల్లో వైభ‌వ్ 29 బంతుల్లోనే 94 ప‌రుగుల సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన‌ప్ప‌టికీ తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాలంటే ఐర్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌లో వైభ‌వ్ త‌న ప్రతాపం చూపించాల్సిన అవ‌స‌ర‌ముంది. 

ఇక డుబ్లిన్ వేదిక‌గా రెండు వ‌న్డేలు ఆడ‌నున్న టీమిండియా ఆ త‌ర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడ‌నుంది. జూలై 1 నుంచి 11 మ‌ధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆ త‌ర్వాత జూలై 14 నుంచి 19 మ‌ధ్య మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. వ‌న్డే జ‌ట్టును గిల్ న‌డిపించ‌నుండ‌గా, టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది.

 

Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌.. అల్జీరియా సంచలన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement