అభిషేక్ శ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు | Abhishek Sharma Broken-Many-Records Fastest Fifty Vs Ireland 1st T20I | Sakshi
Sakshi News home page

అభిషేక్ శ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు

Jun 26 2026 9:24 PM | Updated on Jun 26 2026 9:29 PM

Abhishek Sharma Broken-Many-Records Fastest Fifty Vs Ireland 1st T20I

ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ 19 బంతుల్లోనే అర్ధ‌శ‌తకం మార్క్ అందుకోవ‌డం ద్వారా ప‌లు రికార్డుల‌ను స‌వ‌రించాడు. ఆ రికార్డులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.

👉అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 20 లేదా అంత‌కంటే త‌క్కువ బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేయ‌డం అభిషేక్ శ‌ర్మ‌కు ఇది ఐదోసారి కావ‌డం విశేషం. టీ20 క్రికెట్‌లో ఒక ఫుల్ మెంబ‌ర్ టీమ్ త‌ర‌ఫునఅత్య‌ధిక సార్లు తక్కువ‌ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన బ్యాట‌ర్‌గా అభిషేక్ శ‌ర్మ రికార్డుల‌కెక్కాడు.

👉ఐర్లాండ్‌పై అత్యంత త‌క్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన మూడో బ్యాట‌ర్‌గా అభిషేక్ నిలిచాడు. గ‌తంలో 2014లో స్టీఫెన్ మైబ‌ర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించ‌గా, 2023లో బంగ్లాదేశ్ బ్యాట‌ర్ లిట‌న్ దాస్ 18 బంతుల్లో, తాజాగా అభిషేక్ 19 బంతుల్లో, 2025లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ఫిల్ సాల్ట్ 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

👉టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో త‌క్కువ బంతుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసిన తొలి బ్యాట‌ర్‌గా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకునేందుకు 528 బంతులు తీసుకున్నాడు. గ‌తంలో సూర్య‌కుమార్ యాద‌వ్ (573 బంతులు), శివ‌మ్ దూబే (648 బంతులు), సంజూ శాంస‌న్‌, హార్దిక్ పాండ్యా (679 బంతులు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement