టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్‌లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు.
ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది.
టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ వంద సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా తరఫున రోహిత్ శర్మ (205 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (179 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. 49 మ్యాచ్‌ల్లోనే అభిషేక్ వంద సిక్సర్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఇక అభిషేక్ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్‌ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం.
Milestone unlocked 🔓
1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏
Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG— BCCI (@BCCI) July 1, 2026


