ఫైనల్లో అభిషేక్ శ‌ర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ | Abhishek Sharma Creates History, Fastest 50s in T20 WC Knockouts | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఫైనల్లో అభిషేక్ శ‌ర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ

Mar 8 2026 7:36 PM | Updated on Mar 8 2026 8:01 PM

Abhishek Sharma Creates History, Fastest 50s in T20 WC Knockouts

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కీల‌క మ్యాచ్‌లో త‌న ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో అభిషేక్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్‌కు చెక్‌ పెడుతూ కివీస్‌ బౌలర్లను ఉతికారేశాడు.

నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్‌ కేవలం 18 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్‌ చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌, ఇంగ్లండ్‌ యువ సంచలనం జాకబ్‌ బెతల్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని అభిషేక్‌ అధిగమించాడు.

ఓవరాల్‌గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్‌.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్‌ స్కోర్‌ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ దాటింది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement