IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ | Abhishek Sharma Creates History Becomes 1t Indian After Virat Kohli To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. సెంచరీల వీరుడిగా..

Apr 21 2026 9:32 PM | Updated on Apr 21 2026 9:53 PM

Abhishek Sharma Creates History Becomes 1t Indian After Virat Kohli To

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.

ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

అభిషేక్‌ ధనాధన్‌..
కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్‌ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.

కాగా ఐపీఎల్‌లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్‌.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.

క్లాసెన్‌ ఫటాఫట్‌
ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల వీరులు
🏏క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 22 సెంచరీలు
🏏బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 12 సెంచరీలు
🏏డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు
🏏క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు
🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు
🏏రిలీ రొసోవ్‌ (సౌతాఫ్రికా)-  9 సెంచరీలు
🏏సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌)- 9 సెంచరీలు
🏏అభిషేక్‌ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.

చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

Advertisement
 
Advertisement
Advertisement