SRH vs DC
-
క్రెడిట్ మొత్తం అతడికే.. క్లాసెన్ అదరగొట్టాడు: ఇషాన్ కిషన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. హర్ష్ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అభిషేక్ శర్మ విషయంలో తాము చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ మంగళవారం సన్‌రైజర్స్‌తో తలపడింది.సొంతమైదానంలో టాస్ ఓడిన సన్‌రైజర్స్ ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు (13 బంతుల్లో 37 నాటౌట్) మెరిపించాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.రెండుసార్లు మిస్‌అయితే, తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్‌ను రనౌట్ చేసే అవకాశం రాగా.. ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఛాన్స్ మిస్ చేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. 14వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపగా.. నితీశ్ రాణా క్యాచ్ మిస్ చేశాడు.ఆ రెండు తప్పులే మా కొంపముంచాయిఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 195 పరుగులే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ను రనౌట్ చేసే అవకాశం వదులుకున్నాం. క్యాచ్ కూడా జారవిడిచాము. ఈ రెండు తప్పిదాల వల్లే మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఒకవేళ ఈ రెండింటిలో ఒక్క సందర్భంలో మేము అవకాశం సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే, అతడు మా తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకుని పరుగులు రాబట్టాడు. మేము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. కానీ ఈరోజు అలా చేయలేకపోయాము’’ అని అక్షర్ పటేల్ విచారం వ్యక్తం చేశాడు.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’𝐀𝐛𝐡𝐢-cadabra… & it’s a HUNDRED off just 47 balls 🪄🤯2nd TATA IPL Century ✅9th century in T20s - also the joint-most centuries by an Indian ✅Fastest Indian to 9 T20 hundreds (184 innings) ✅#AbhishekSharma | #TATAIPL 2026 | #SRHvDC | LIVE NOW 👉… pic.twitter.com/YHeoeyyahv— Star Sports (@StarSportsIndia) April 21, 2026 -
IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అభిషేక్ ధనాధన్..కాగా ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.కాగా ఐపీఎల్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.క్లాసెన్ ఫటాఫట్‌ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.Incredible knock, iconic celebration 🙌An Abhishek Sharma special lights up Hyderabad 💯Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D— IndianPremierLeague (@IPL) April 21, 2026టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల వీరులు🏏క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 22 సెంచరీలు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 12 సెంచరీలు🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు🏏క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు🏏రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్)- 9 సెంచరీలు🏏అభిషేక్ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు అభిషేక్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది.18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపటల్స్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 38, అక్షర్ పటేల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లుఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఇషాన్ మలింగ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత 57 పరుగుల చేసిన నితీశ్ రానాను వెనక్కి పంపిన మలింగ మరుసటి బంతికి డేవిడ్ మిల్లర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఢిల్లీ 86-18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్ (27), నితీశ్ రానా (47) క్రీజులో ఉన్నారు.పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 59-1(6)రాహుల్ 22, నితీశ్ 27 రన్స్‌తో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 184 పరుగులు అవసరం.ఐదు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 54-1కేఎల్ రాహుల్ 21, నితీశ్ రాణా 23 పరుగులతో ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 189 పరుగులు కావాలి.ఢిల్లీ తొలి వికెట్ డౌన్2.1: దిల్షాన్ మధుషాంక బౌలింగ్‌లో తొలి వికెగ్గా వెనుదిరిగిన పాతుమ్ నిస్సాంక (6 బంతుల్లో 8). కేఎల్ రాహుల్ 12 పరుగులతో ఉండగా.. నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-1(2.1).ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 37 నాటౌట్) ఆడాడు. ట్రవిస్ హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ విధించిన 243 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ స్కోరు: 242-2(20)సన్‌రైజర్స్ డబుల్ సెంచరీ: స్కోరు: 202-2(17)అభిషేక్ 127, క్లాసెన్ ఆరు పరుగులతో ఉన్నారు16 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 189-2 రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ 14.4: ఇషాన్ కిషన్ రనౌట్ (13 బంతుల్లో 25). అభిషేక్ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)అభిషేక్ శర్మ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ13 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 151-1అభిషేక్ 86, ఇషాన్ 23 రన్స్‌తో ఉన్నారు.పది ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 104-1అభిషేక్ 60, ఇషాన్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్8.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37) అవుట్. స్కోరు: 97-1(8.5). అభిషేక్ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.👉25 బంతుల్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీరఫ్పాడించిన అభిషేక్’ పవర్ ప్లేలో ‘అభిషేక్’ రఫ్పాడించారు. హెడ్ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్ ప్లేలో సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 56-0ఓపెనర్లు అభిషేక్ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్‌హెడ్ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.టాస్ గెలిచిన ఢిల్లీఐపీఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకుని ఇషాన్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదిక. తుదిజట్టు మార్పులుఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఆకిబ్ నబీ స్థానంలో నితీశ్ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. హర్ష్ దూబేను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా ప్రఫుల్ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే.. గత మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్లుసన్రైజర్స్అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, దిల్షాన్ మధుషాంక, హర్షల్ పటేల్ఢిల్లీపాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడిఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కరుణ్ నాయర్, దుష్మంత చమీర, అశుతోశ్ శర్మ, త్రిపురాణ విజయ్, ఆకిబ్ నబీ.


