ఢిల్లీ ‍క్యాపిటల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం | IPL 2026 SRH vs DC Uppal: Rain Threat Toss Playing XIs Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ‍క్యాపిటల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం

Apr 21 2026 7:01 PM | Updated on Apr 21 2026 11:31 PM

IPL 2026 SRH vs DC Uppal: Rain Threat Toss Playing XIs Updates

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. 

నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు అభిషేక్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది.

  • 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపటల్స్‌ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సమీర్‌ రిజ్వీ 38, అక్షర్‌ పటేల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాల్లో ప‌డింది. ఇషాన్ మ‌లింగ‌ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు  కోల్పోయింది. తొలుత 57 పరుగుల చేసిన నితీశ్ రానాను వెన‌క్కి పంపిన మ‌లింగ మ‌రుస‌టి బంతికి డేవిడ్ మిల్ల‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది.

8 ఓవర్లలో ఢిల్లీ 86-1
8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్‌ (27), నితీశ్‌ రానా (47) క్రీజులో ఉన్నారు.

పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు: 59-1(6)
రాహుల్‌ 22, నితీశ్‌ 27 రన్స్‌తో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 184 పరుగులు అవసరం.

ఐదు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 54-1
కేఎల్‌ రాహుల్‌ 21, నితీశ్‌ రాణా 23 పరుగులతో ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 189 పరుగులు కావాలి.

ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
2.1: దిల్షాన్‌ మధుషాంక బౌలింగ్‌లో తొలి వికెగ్‌గా వెనుదిరిగిన పాతుమ్‌ నిస్సాంక (6 బంతుల్లో 8). కేఎల్‌ రాహుల్‌ 12 పరుగులతో ఉండగా.. నితీశ్‌ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-1(2.1).

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242  పరుగులు చేసింది. 

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (13 బంతుల్లో 37 నాటౌట్‌) ఆడాడు. ట్రవిస్‌ హెడ్‌ 37, ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్‌ విధించిన 243 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బరిలోకి దిగింది. 

సన్‌రైజర్స్‌ స్కోరు: 242-2(20)
సన్‌రైజర్స్‌ డబుల్‌ సెంచరీ: స్కోరు: 202-2(17)
అభిషేక్‌ 127, క్లాసెన్‌ ఆరు పరుగులతో ఉన్నారు

16 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 189-2
 రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ 
14.4: ఇషాన్‌ కిషన్‌ రనౌట్‌ (13 బంతుల్లో 25). అభిషేక్‌ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)

అభిషేక్‌ శర్మ సెంచరీ
47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ

13 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 151-1
అభిషేక్‌ 86, ఇషాన్‌ 23 రన్స్‌తో ఉన్నారు.

పది ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 104-1
అభిషేక్‌ 60, ఇషాన్‌ 4 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌
8.5: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సమీర్‌ రిజ్వీకి క్యాచ్‌ ఇచ్చి ట్రవిస్‌ హెడ్‌ (26 బంతుల్లో 37) అవుట్‌. స్కోరు: 97-1(8.5). అభిషేక్‌ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.
👉25 బంతుల్లో అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ

రఫ్పాడించిన అభిషేక్’‌‌ 
పవర్‌ ప్లేలో ‘అభిషేక్’‌‌ రఫ్పాడించారు. హెడ్‌ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్‌ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)

ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 56-0
ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్‌హెడ్‌ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్‌’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.

టాస్‌ గెలిచిన ఢిల్లీ
ఐపీఎల్‌-2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచింది. తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఇషాన్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదిక. 

తుదిజట్టు మార్పులు
ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. ఆకిబ్‌ నబీ స్థానంలో నితీశ్‌ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. హర్ష్‌ దూబేను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు తెలిపాడు.  

అదే విధంగా ప్రఫుల్‌ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్‌ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్‌ హింగే.. గత మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.
 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిజట్లు
సన్‌రైజర్స్‌
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: స్మరణ్‌ రవిచంద్రన్‌, ప్రఫుల్‌ హింగే, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దిల్షాన్‌ మధుషాంక, హర్షల్‌ పటేల్‌

ఢిల్లీ
పాతుమ్ నిస్సాంక, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), సమీర్ రిజ్వీ, నితీశ్‌ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్‌ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడి
ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: కరుణ్‌ నాయర్‌, దుష్మంత చమీర, అశుతోశ్‌ శర్మ, త్రిపురాణ విజయ్‌, ఆకిబ్‌ నబీ.

Advertisement
 
Advertisement
Advertisement