ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.
క్రెడిట్ మొత్తం అతడికే..
నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.
ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.
కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
మలింగ అద్భుతస్పెల్
లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో
ఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.
చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’
Explosive with the bat 🔥
Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026


