ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్! | Abhishek-Travis Head Record Most Partnership Runs In IPL 2026 | Sakshi
Sakshi News home page

ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!

May 6 2026 10:46 PM | Updated on May 6 2026 11:26 PM

Abhishek-Travis Head Record Most Partnership Runs In IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభం ఇవ్వ‌గా.. ఆ త‌ర్వాత మిడిలార్డ‌ర్‌లో ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్‌, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఇక ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌ జంట ఒక అరుదైన ఫీట్‌ సాధించింది. ఈ సీజ‌న్‌లో అభిషేక్‌, ట్రావిస్ హెడ్ జంట 627 ప‌రుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 ప‌రుగులు జోడించ‌డం ద్వారా 600 ప్ల‌స్ మార్కును దాటింది. త‌ద్వారా ఒక సీజ‌న్‌లో 500కు పైగా ప‌రుగులు సాధించిన జోడీగా అభిషేక్‌-హెడ్ నిలిచారు. 

రెండో స్థానంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌-వైభ‌వ్ సూర్య‌వంశీ (457 ప‌రుగులు), గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌-సాయి సుద‌ర్శ‌న్ జంట (402 ప‌రుగులు) సాధించి మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement