అభిషేక్‌ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్‌లో ఉప్పెన! | Abhishek sharma 100 Just 47 Balls In IPL Against DC | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్‌లో ఉప్పెన!

Apr 22 2026 8:59 AM | Updated on Apr 22 2026 12:54 PM

Abhishek sharma 100 Just 47 Balls In IPL Against DC

ఐపీఎల్‌లో అభిషేక్‌ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్‌ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్‌కు క్లాసెన్, ఇషాన్‌ కిషన్, హెడ్‌ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్‌ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్‌ ఏమాత్రం రైజర్స్‌కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్‌ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్‌తో రైజర్స్‌ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది.  

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్‌ క్లాసెన్‌ (13 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్‌ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఇషాన్‌ మలింగకు 4 వికెట్లు దక్కాయి.  

 



భారీ భాగస్వామ్యాలు... 
తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్‌ ఇన్నింగ్స్‌ నితీశ్‌ రాణా వేసిన ఐదో ఓవర్‌తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్‌ కలిసి 3 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టీమ్‌ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్‌ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెడ్‌ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్‌ దూకుడు కొనసాగగా, ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్‌ బ్యాక్‌వర్డ్‌లెగ్‌లో రాణా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్‌ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. 

 

ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్‌లో బౌలర్‌ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రయికింగ్‌ స్టంప్స్‌ను పడగొట్టడంతో కిషన్‌ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్‌ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్‌ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్‌ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్‌గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను... ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు.  

మిల్లర్‌ విఫలం... 
ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అడుగు పెట్టిన పేసర్‌ మదుషంక చక్కటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్‌లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్‌ తీశాడు. మరోవైపు నితీశ్‌ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్‌ కలిసి 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్‌ను సాకిబ్‌ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్‌ (0)లను అవుట్‌ చేయడంతో రైజర్స్‌ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌)  కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్‌ అవుట్‌ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 135; హెడ్‌ (సి) రిజ్వీ (బి) అక్షర్‌ 37; ఇషాన్‌ కిషన్‌ (రనౌట్‌) 25; క్లాసెన్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. 

బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 4–0–53–0, నితీశ్‌ రాణా 4–0–55–0, ఎన్‌గిడి 4–0–41–0, అక్షర్‌ పటేల్‌ 2–0–23–1, కుల్దీప్‌ 2–0–30–0, నటరాజన్‌ 4–0–40–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (సి) (సబ్‌) లివింగ్‌స్టోన్‌ (బి) మదుషంక 8; రాహుల్‌ (సి) అభిషేక్‌ (బి) సాకిబ్‌ 37; నితీశ్‌ రాణా (సి) అభిషేక్‌ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్‌ (బి) మలింగ 0; స్టబ్స్‌ (సి) సాకిబ్‌ (బి) మలింగ 27; అశుతోష్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 14; అక్షర్‌ (సి) నితీశ్‌ (బి) దూబే 2; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎన్‌గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్‌: మదుషంక 4–0–36–1, నితీశ్‌ రెడ్డి 4–0–57–0, ఇషాన్‌ మలింగ 4–0–32–4, సాకిబ్‌ 4–0–29–1, శివాంగ్‌ 2–0–28–0, హర్‌‡్ష దూబే 2–0–12–3.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement