ఎస్‌ఆర్‌హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్‌! | Sunrisers Hyderabad Smash 255 Vs Royal Challengers Bengaluru As Trio Cross 500 Run Milestone In IPL 2026, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్‌!

May 22 2026 9:55 PM | Updated on May 23 2026 9:56 AM

SRH Only 2nd Team-History Three Batters 500 Runs In Single Edition

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో  స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. 

ఈ సంగతి పక్కనబెడితే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, హెనిరిచ్ క్లాసెన్‌లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్‌లో అభిషేక్‌, క్లాసెన్‌, ఇషాన్‌లు 500 పరుగుల మార్క్‌ను దాటారు. 

తద్వారా ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఆ సీజన్‌లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్‌మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. 

తాజా సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్‌క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement