ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంతగడ్డపై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాలని భావిస్తున్న ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు చేసింది.
ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మరోసారి చెలరేగాడు. పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిలవనప్పటికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దడదడలాడించాడు.
👉 ఈ నేపథ్యంలో పంజాబ్‌పై గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ పరుగుల వరద పారించాడు. అభిషేక్ వరుసగా 66, 141, 74, 35 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్లస్ స్కోరు సాధించడం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఎనిమిదోసారి.
👉ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.
👉 ఇక ఐపీఎల్‌లో 220 ప్లస్ స్కోరు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Combining power and elegance so effortlessly 😲
🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩
Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026


