గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఊదిపడేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ తలా వికెట్ సాధించారు.
బుమ్రా మ్యాజిక్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్‌మన్ (32), సాంట్నర్ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ'


