ఐర్లాండ్‌తో జరిగిన నిన్న జరిగిన రెండో టీ20లో భారత జట్టు అత్యంత అవమానకరమైన రికార్డును మూటగట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ (సంజూ శాంసన్, అభిషేక్ శర్మ) గోల్డెన్ డకౌటై టీమిండియాను అప్రతిష్టపాలు చేశారు. భారత టీ20 చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
గతంలో ఎప్పుడూ ఓపెనర్లిద్దరూ గోల్డెన్ డకౌట్ కాలేదు. మొత్తంగా అంతర్జాతీయ చరిత్రలో ఇలా జరగడం కేవలం నాలుగోసారి మాత్రమే. తొలిసారి ఈ అవాంఛనీయ రికార్డును బంగ్లాదేశ్ మూటగట్టుకుంది. ఆతర్వాత మలేసియా, కామెరూన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియాకు పసికూన్ ఐర్లాండ్ చేతిలో ఘోర అవమానం ఎదురైంది. వరుసగా రెండో టీ20లోనూ ఓడిన భారత్.. సిరీస్‌ను సైతం కోల్పోయింది. ఐర్లాండ్‌కు ఏ ఫార్మాట్‌లో అయినా భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. భారత్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సంజూ, అభిషేక్ చెత్త ప్రారంభం తర్వాత ఓ మోస్తరుగా నిలదొక్కుకున్న భారత్.. 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
ఆఖర్లో హర్షిత్ రాణా బ్యాట్ ఝులిపించడం చూసి భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి అతడు ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైపోయింది. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదినా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ ఓటమితో భారత్ వరుస సిరీస్ విజయాల యాత్రకు బ్రేక్ పడింది. 16 సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఈ సిరీస్ విశేషంగా రాణించిన (5 వికెట్లు) ఐర్లాండ్ పేసర్ జై మూండ్రకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. రెండో మ్యాచ్‌లో మూండ్ర 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ ఓటమితో టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు వెత్తుతున్నాయి.


