అభిషేక్‌ శర్మ ఖాతాలో భారీ రికార్డు | IPL 2026 SRH VS KKR: Abhishek Sharma completed 100 sixes for SRH | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ శర్మ ఖాతాలో భారీ రికార్డు

Apr 2 2026 9:02 PM | Updated on Apr 3 2026 10:21 AM

IPL 2026 SRH VS KKR: Abhishek Sharma completed 100 sixes for SRH

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర  ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఖాతాలో మరో భారీ సిక్సర్ల రికార్డు చేరింది. ఇప్పటికే ఎన్నో సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్న అభిషేక్‌.. తాజాగా సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకొని, మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

అతనికి ముందు డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్‌, అభిషేక్‌ తర్వాతి స్థానాల్లో క్లాసెన్‌ (89), కేన్‌ విలియమ్సన్‌ (64), ట్రవిస్‌ హెడ్‌ (50) ఉన్నారు.

కాగా, ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) సన్‌రైజర్స్‌-కేకేఆర్‌ తలపడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. ఈ  మ్యాచ్‌లోనే అభిషేక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి బంతి నుంచి ప్రత్యర్దిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. 

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (14) అదే జోరును కొనసాగించే క్రమంలో ఔటయ్యాడు. అనికేత్‌ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. క్లాసెన్‌ (34), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 184-4గా ఉంది. ముజరబానీ 2, కార్తీక్‌ త్యాగి, అనుకూల్‌ రాయ్‌ తలో వికెట్‌ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement