వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా | Vaibhav Sooryavanshi has become the Indian batter with the most sixes in an IPL season | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా

May 17 2026 9:48 PM | Updated on May 17 2026 9:48 PM

Vaibhav Sooryavanshi has become the Indian batter with the most sixes in an IPL season

ఐపీఎల్‌-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్‌ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.

బౌండరీలు బాదుతూ స్టార్క్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్‌ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2024లో అభిషేక్ 42 సిక్స‌ర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ను సూర్య‌వంశీ దాటేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్‌లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజ‌స్తాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్య‌వంశీ బ్రేక్ చేసే అవ‌కాశ‌ముంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడి 486 ప‌రుగులు చేశాడు.

ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయ‌ర్లు వీరే:
వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026)  

అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024)  

శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025)  

విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024)  

సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025)  

Advertisement
 
Advertisement
Advertisement