అభిషేక్‌ శర్మ అట్టర్‌ ప్లాప్‌ | Abhishek Sharma flops in opener match in IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అభిషేక్‌ శర్మ అట్టర్‌ ప్లాప్‌

Mar 28 2026 8:18 PM | Updated on Mar 28 2026 8:26 PM

Abhishek Sharma flops in opener match in IPL 2026

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పేలవంగా ఆరంభించాడు. చిన్న‌స్వామిస్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌ర‌గుతున్న తొలి మ్యాచ్‌లో అభిషేక్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. 

8 బంతుల్లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జాక‌బ్ డ‌ఫీ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఒక్క సిక్స్ మాత్ర‌మే ఉంది. అయితే  డ‌ఫీ మాత్రం తన పేస్‌ బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తిస్తున్నాడు. 

అత‌డి బౌలింగ్ ధాటికి స‌న్‌రైజ‌ర్స్ ట్రావిస్ హెడ్‌(11), నితీశ్ కుమార్ రెడ్డి(1) వంటి కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. మొత్తం మూడు వికెట్లు కూడా అత‌డే తీశాడు. ఈ కివీ పేస‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మెరుగ్గా రాణించిక‌పోయిన‌ప్ప‌టికి.. త‌న తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం దుమ్ము లేపాడు. దీంతో సన్‌రైజర్స్‌ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement