ఇటీవలికాలంలో విదేశాల్లో భారతీయులు చేసే కొన్ని నృత్యాల చుట్టూ జరుగుతున్న వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జనాలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాలలో ‘గర్బా’ డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర స్పృహ (Civic sense) పాటించడం లేదనే దుమారం రేగింది. అయితే 'గెంట్స్ ఫీస్టెన్ 2026' (Gentse Feesten 2026) పండుగ వేడుకలపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా ఒక ఇంట్రస్టింగ్ వీడియోను పంచుకున్నారు.
జూలై 26న బెల్జియంలో జరిగిన ఈ ఈవెంట్ భిన్నంగా నిలిచింది. ఈ వీడియోలో భారతీయులతో పాటు స్థానిక విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కలిసి గర్బా అడుగులు వేశారు అంటూ దీనికి సంబంధించిన వీడియోను గోయోంకా షేర్ చేశారు. గర్బా డ్యాన్స్‌పై నెట్టింట వెల్లువెత్తిన విమర్శల మధ్య ఐక్యత, సంబరం, కమ్యూనిటీ స్పిరిట్‌కు నిజమైన ప్రతీక గర్బా అని గుర్తుచేసే చక్కటి సంఘటన ఇది అని పేర్కొన్నారు.
నెటిజన్ల స్పందనలు
ఈవీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సంగీతంలో దమ్ముంటే విమర్శకులు కూడా సర్కిల్‌లో వచ్చి డ్యాన్స్ చేయాల్సిందే అని కొందరు వ్యాఖ్యానించారు. సార్వజనిక సాధారణ జీవితానికి ఆటంకం కలిగించనంత వరకు ఇది మంచిదే. ఎయిర్‌పోర్టులు, హైవేలపై డ్యాన్సులు చేయడం మాత్రం సరికాదు అని కొందరు సూచించారు. ఏ పనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి అన్నారు మరికొందరు. బెల్జియంలో గర్బా ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఇటీవల భారతీయుల పబ్లిక్ ప్రవర్తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ఘటన భారతీయ సంస్కృతిని విదేశాల్లో ఎంతో అందంగా చాటిచెప్పేలా నిలిచింది.
Amid the flood of Garba criticism online, here’s a heartwarming reminder that the true spirit of Garba is inclusion, celebration, and community. pic.twitter.com/CIlDcQrhEP
— Harsh Goenka (@hvgoenka) July 29, 2026
ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు
గతంలో విమర్శలకు దారితీసిన ఘటనలు
నిలిపి ఉంచిన విమానం పక్కన టార్మాక్‌పై ప్రయాణికులు గర్బా డ్యాన్స్ చేయడం.
చైనాలోని చారిత్రాత్మక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ప్రదేశంలో నృత్యం చేసిన ఘటన
కొండచరియలు విరిగిపడి ఒకవైపు వాహనాలు నిలిచిపోయి ఒక వైపు జనం ఇబ్బందులు పడుతోంటే, మరోవైపు రోడ్డుపై డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే కొచ్చి వాటర్‌లో కదులుతున్న ఫెర్రీ బోటులో గర్బా చేయడంపై కూడా విమర్శలు చెలరేగాయి.
ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు


