ఇంట్రెస్టింగ్‌గా 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ | Aakasam Lo Oka Tara Movie Glimpse Telugu | Sakshi
Sakshi News home page

Aakasam Lo Oka Tara: దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'.. గ్లింప్స్ చూశారా?

Jul 28 2025 6:08 PM | Updated on Jul 28 2025 6:36 PM

Aakasam Lo Oka Tara Movie Glimpse Telugu

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరస సినిమాలు చేస్తున్నాడు. హీరో రానాతో పాటు 'కాంత' అనే మూవీని నిర్మిస్తున్న దుల్కర్.. అందులో హీరోగానూ చేస్తున్నాడు. 1950-60ల్లో ఓ హీరో-డైరెక్టర్ మధ్య జరిగే ఇగో క్లాష్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు తెలుగులోనే 'ఆకాశంలో ఒక తార' చిత్రంలోనూ నటిస్తున్నాడు. సోమవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాలో దుల్కర్ హీరో కాగా పవన్ సాధినేని దర్శకుడు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు. గ్లింప్స్‌లో అలానే దుల్కర్‌ని ఓ సాధారణ కుర్రాడిగా చూపించారు. బ్యూటీఫుల్ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు.. అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కల ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే స్టోరీ అని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. టీజర్, ట్రైలర్ వస్తే ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement