గుడిలో విగ్రహాలు మిస్సింగ్.. 'హైందవ' టీజర్ రిలీజ్ | Bellamkonda Sreenivas Haindava Movie Teaser | Sakshi
Sakshi News home page

Haindava Teaser: బెల్లంకొండ శ్రీనివాస్ మిస్టిక్ థ్రిల్లర్ 'హైందవ' టీజర్

Oct 14 2026 7:07 PM | Updated on Oct 14 2026 7:25 PM

Bellamkonda Sreenivas Haindava Movie Teaser

ఈ ఏడాది పెళ్లి చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'హైందవ'. దేవుడి కాన్సెప్ట్‌కి థ్రిల్లర్ కథని జోడించి తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. మూవీ విడుదల తేదీని కూడా వెల్లడించారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా లుధీర్ బైరెడ్డి దర్శకుడు.

(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')

రంగాపురం అనే ఊరిలో ఉండే గుడిలో విగ్రహాలు కనిపించకుండాపోతాయి. మరోవైపు ఓ వ్యక్తి చనిపోతాడు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు పోలీస్ అయిన హీరో వస్తాడు. దేవుడంటే పెద్దగా నమ్మకం లేని ఇతడు.. ఈ విగ్రహాలు మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడు? ఈ క్రమంలో ఏం తెలుసుకున్నాడనేది స్టోరీలా అనిపిస్తుంది.

వచ్చే నెల 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీజర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. 'ఏం జరుగుతుందో చెప్పి, ఎలా జరుగుతుందో చూడమనే వాడే నయ్యా.. దేవుడంటే' డైలాగ్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. మరి మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఎ‍ట్టకేలకు ఓటీటీలోకి 'ద ఒడిస్సీ'.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement