హుక్‌ స్టెప్‌ సవాల్‌.. గెలిస్తే రూ. లక్ష సొంతం! | Diamond Dacoit Movie Team Hook Step Challenge | Sakshi
Sakshi News home page

హుక్‌ స్టెప్‌ సవాల్‌.. గెలిస్తే రూ. లక్ష సొంతం!

Mar 22 2026 8:59 AM | Updated on Mar 22 2026 8:59 AM

Diamond Dacoit Movie Team Hook Step Challenge

పార్థ గోపాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’. మేఘన హీరోయిన్‌గా నటించారు. సూర్య జి. యాదవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్‌ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని, పాటలను విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. 

‘‘ఫ్యామిలీ ఎమోషన్‌ అండ్‌ రివెంజ్‌ మూవీ ఇది. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయనున్నాం. ఈ చిత్రంలోని ‘మరదలివే..’ పాటలోని హుక్‌ స్టెప్‌ రీల్స్‌ చేసి, పంపించేవారిలో విజేతలకు నగదు బహుమతులు ఇస్తాం’’ అని తెలిపారు పార్థ గోపాల్‌.  మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. ‘‘పెద్దపల్లి రోహిత్‌ ఈ సినిమాకు మంచి సంగీతం, ఆర్‌ఆర్‌ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు సూర్య జి. యాదవ్‌.  

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement