breaking news
Meera Chopra
-
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్‌కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్‌కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
ప్రియుడిని పెళ్లాడిన బంగారం హీరోయిన్.. ముఖం ఎలా వెలిగిపోతోందో! (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ మీరా చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా తన ప్రియుడు రక్షిత్‌తో ఏడడుగులు వేసింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన మీరా.. ఈ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మీరా అభిమానులు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం మీరా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తెలుగువారికి సైతం సుపరిచితులైన మీరా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.కాగా.. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేయనున్న బంగారం హీరోయిన్
మాఘమాసం వచ్చేసింది.. పెళ్లి సంబరాలు తెచ్చేసింది.. ఇప్పటికే ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంలో అడుగుపెడుతుండగా, పలువురూ వారి పెళ్లికి ముహూర్తం పిక్స్ చేసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 21న) రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో బ్యూటీ మీరా చోప్రా వివాహానికి రెడీ అవుతోంది. ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెడతానని గతంలోనే హింటిచ్చింది. అన్నట్లుగానే మార్చి 11 లేదా 12న జైపూర్‌లో పెళ్లి చేసుకోనుందట! ఇప్పటికే మీరాతో పాటు ఆమె కుటుంబం పెళ్లి పనుల్లో తలమునకలైందట! తన పెళ్లికి 150 మందికిపైగా అతిథులు హాజరవుతారంది మీరా చోప్రా. పెళ్లి తర్వాత సెలబ్రిటీలు, బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తానంటోంది. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక, పరిణీతి చోప్రాకు కజిన్ అవుతుంది. కాగా మీరా చోప్రా 2005లో అన్బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బంగారం, మారో, వాన, గ్రీకువీరుడు సినిమాలు చేసింది. ద టాటూ మర్డర్డ్స్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెట్టింది. ఆమె నటించిన సఫేద్ మూవీ ఈ గతేడాది జీ5లో అందుబాటులోకి వచ్చింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
Meera Chopra: చెక్కు చెదరని అందంతో దడ పుట్టిస్తున్న బంగారం హీరోయిన్ (ఫోటోలు)
-
అవును నిజమే.. పెళ్లి చేసుకుంటున్నా: బంగారం మూవీ హీరోయిన్
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటికే ప్రముఖ హీరోలు వివాహాబంధంతో ఒక్కటవ్వగా.. బాలీవుడ్లో పలువురు తారలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో నటి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం సఫేద్ అనే చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ నటి మీరా చోప్రా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. మీరా చోప్రా మాట్లాడుతూ.. 'అవును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నా. 2024 ఫిబ్రవరి నెలాఖరున నా పెళ్లి జరగనుంది. ఇప్పటికే నా కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నా పెళ్లివేడుక రాజస్థాన్‌లో గ్రాండ్‌గానే జరగనుంది. మా పెళ్లి వేడుకకు 150 మంది అతిథులు హాజరవుతారని' అని మీరా వెల్లడించింది. అయితే పెళ్లి తర్వాత స్నేహితులు, బాలీవుడ్ తారల కోసం ముంబైలో రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. కానీ తనకు కాబోయే భర్త వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా మీరా ఒక మిస్టరీ మ్యాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్యార్ వాలా క్రిస్మస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె పెళ్లి గురించి చర్చ మొదలైంది. అయితే మీరా చోప్రా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ అవుతారు. కాగా.. మీరా చోప్రా 2016లో '1920: లండన్'చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించింది. ప్రస్తుతం మీరా సఫేద్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సినిమా ఛాన్సుల కోసం వేడుకుంటున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు మీరా చోప్రా సోదరి అవుతుంది. టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రాబోతుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం పోరాడి విసిగిపోయానని ఆమె చెప్పింది. 'నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి చాలా విసిగిపోయాను. నేను ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాను. అయినా వాటంన్నింటి అదిగమించి ముందుకు సాగాలని ఉంది. దయచేసి నాకు సినిమా అవకాశాలు ఇవ్వండి. బహిరంగంగానే అడుగుతున్నాను... దయచేసి నాకు కాల్ చేయండి. నాకు మంచి పాత్రలు ఇవ్వండి. నేను నిజంగా మంచి నటిని అని అనుకుంటున్నాను. సెక్షన్ 375 అయిపోయాక మీరా చోప్రా కమ్ బ్యాక్ అన్నారు. అందులో నా నటన చూసి ఎందరో ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా చాలా అవకాశాలు వస్తాయిని పలు కథనాలు రాశారు.. కానీ అలాంటిదేమీ జరగలేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లానో నాకు తెలియదు. నేను నిజంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది. మీరా చోప్రా నటించిన సఫేద్ చిత్రంలో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో అయినా మరిన్నీ అవకాశాలు వస్తాయిని ఆమె ఆసిస్తుంది. సఫేద్ డిసెంబర్ 29న రాబోతున్న లింగమార్పిడి, వితంతువుల మధ్య జరిగే అనూహ్యమైన ప్రేమకథ. గతంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొందీ భామ. తర్వాత క్షమాపణ చెప్పడంతో ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
ఎన్టీఆర్‌పై పరోక్షంగా మీరా చోప్రా పోస్ట్.. ఫ్యాన్స్ చురకలు
Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR: వాన, బంగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ మీరా చోప్రా. అయితే అంతకన్నా ఎక్కువగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ట్వీట్లతో ఆమె మరింత పాపులర్ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరా చోప్రా ట్వీట్లు తెగ వైరల్ అయ్యాయి. ఆ ట్వీట్లు చూసిన ఎన్టీఆర్ అభిమానులు మీరాపై ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది మీరా చోప్రా. అయితే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్ మళ్లీ తారక్ ఫ్యాన్స్ మండిపోయేలా చేసింది. చదవండి: ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా 'సౌత్ ఇండియన్ యాక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్, వినయం, ప్యాషన్‌ను చూసి ఒకరు కచ్చితంగా నేర్చుకోవాలి.' అంటూ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లకు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఈ పోస్టులో కావాలనే ఎన్టీఆర్‌ను మెన్షన్ చేయలేదని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొణె, అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లే జూనియర్ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఇష్టపడుతున్నారని, అవుట్ డేటెడ్, జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనికిరాని వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తారక్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక సమయంలో ఎన్టీఆర్‌కు జోడీగా మీరా చోప్రాకు నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఈ అక్కసుతోనే తారక్‌ను మీరా చోప్రా టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతుందని సమాచారం. I feel so happy to see South indian actors getting pan india recognition. One should learn from their talent, their humility, their passion.#prabhas #alluarjun #ramcharan #yash. So proud 👏👏👏👏 — meera chopra (@MeerraChopra) April 9, 2022 BOLLYWOOD Superstar Deepika About Jr. NTR . Character Artist kuda paniki rani Vallaki attention Evvakandi 🤭🤭 pic.twitter.com/Opc2taw7w9 — ...... 🐐 (@SK_Tarock) April 9, 2022 -
బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Bangaram Movie Child Artist, Sanusha Santhosh Present Photos Goes Viral: పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? వింధ్య రెడ్డి పాత్రలో నటించి మెప్పించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సనూషా సంతోష్. బంగారం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2012లో మిస్టర్ మురుగన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడి శరీరాకృతిపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్ చేసినా ధీటుగా జవాబిస్తుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్డౌన్ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వ్యాక్సినేషన్: చిక్కుల్లో మీరా చోప్రా
ఒకవైపు వ్యాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూప్ గందరగోళం నడుస్తుండగా, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ డోస్‌లను బ్లాక్‌లో అమ్ముకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు తేలికగా వ్యాక్సిన్లు దొరుకుతున్న తీరు.. రోజుల తరబడి, గంటల సేపు లైన్లో క్యూ కడుతున్న వాళ్లకు కోపం తెప్పిస్తోంది. తాజాగా నటి మీరాచోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం.. రాజకీయ విమర్శలకు దారితీసింది. థానే: నటి, మోడల్ మీరా చోప్రా ఈమధ్యే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆమె ఫ్రంట్‌లైన్ వారియర్ కోటాలో ఫేక్ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ మండిపడుతోంది. మీరా చోప్రా అలియాస్ నీలా తమిళంతో పాటు తెలుగు, హింది సినిమాల్లో నటించింది. ఆమె థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర డోస్ వేయించుకుంది. ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె సూపర్వైజర్గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఇది ముమ్మాటికీ రూల్స్‌ను ఉల్లంఘించినట్లే. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ కోరుతోంది. కాగా, ఈ విచారణపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్ పీఆర్వో సందీప్ మాల్వీ చెబుతున్నారు. కాగా, తెలుగులో బంగారం, మారో, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. పలు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే వ్యాక్సినేషన్‌పై దుమారం చెలరేగడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ తొలగించడంతో పాటు మీడియాకు దొరక్కుండా తిరుగుతోందని సమాచారం. A good decision and a good deed should always be acknowledged https://t.co/m08lkynwYi — meera chopra (@MeerraChopra) May 29, 2021 -
బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు..జీఎస్టీ ఎందుకు కట్టాలి: నటి
కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటుంది. డబ్బులు ఉన్నా సరైన వైద్యం అందక ఎంతోమంది తమ ఆప్తులను పోగొట్టుకుంటున్నారు. కరోనా కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పించారు. కోవిడ్ రోగులకు సకాలంలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించనప్పుడు ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పీఎంవో ఇండియా, అమిత్ షా సహా కొందరు కేంద్ర మంత్రలకు ట్యాగ్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటి మీరా చోప్రా బంధువులు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆమె తన ఇద్దరు కజిన్స్‌ను పోగొట్టుకున్నారు. అయితే వారు కోవిడ్ వల్ల చనిపోలేదని, సరైన వైద్యం అందక మరణించారని మీరా చోప్రా ఇటీవలె వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్ అందక మరొక కజిన్ చనిపోయారని పేర్కొంది. ఇద్దరూ దాదాపు 40 ఏళ్ల వయసు వారేనని, కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. I dont want to pay 18% gst when i cant get a bed in the hospital or an oxygen to breathe and live. #removeGST @AmitShah @FinMinIndia @ianuragthakur @PMOIndia @BJP4India — meera chopra (@MeerraChopra) May 15, 2021 చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా.. -
ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి
ముంబై : కోవిడ్ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని, దీన్ని అరికట్టకపోతే ఇంకెంత మంది ప్రాణాలు పోతాయో అని నటి మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. 'దాదాపు పది నెలల విరామం తర్వాత షూటింగ్స్‌కు వెళ్తున్నామని ఆనందించేలోపే కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా ముంచుకొచ్చింది. కరోనా వైరస్ వల్ల నేను పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు కజిన్స్ కోల్పోయాను. అయితే వారు కోవిడ్ వల్ల చనిపోలేదు. సరైన వైద్యం అందక మరణించారు. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్ అందక మరొక కజిన్ చనిపోయారు. వారు 40 ఏళ్ల వయసువారే. కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. వాళ్లను రక్షించుకోలేకపోయాన్న బాధ నన్ను వెంటాడుతుంది. ఈ రెండు ఘటనల తర్వాత ఎప్పుడు ఎవరకి ఏం జరుగుంతుందో అని అనుక్షణం భయం భయంగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత..ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ ఎదుర్కోలేదు' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి అదుపుతప్పితే చేతులెత్తేసే దుస్థితి నెలకొందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా వివాదాస్పదమైన నటి వ్యాఖ్యలు..అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ -
ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా
గ్లోబల్ స్టార్ ఐకాన్ ప్రియాంక చోప్రా చెల్లి అన్న ఇమేజ్ తనకు పెద్దగా ఉపయోగపడలేని నటి మీరా చోప్రా పేర్కొంది. ప్రియాంక చోప్రా వల్ల తనకు సినిమాలు రాలేదని, కేవలం తన కష్టంతోనే సినిమా అవకాశాలు వరించాయని తెలిపింది. 'ప్రియాంక చోప్రా బంధువు కావడం వల్ల దర్శకులు నన్ను సంప్రదించలేదు. నేను ఆడిషన్స్ ఇచ్చి, వాళ్లకి నచ్చితేనే సినిమాల్లో తీసుకున్నారు. దీని కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నేను సినిమాల్లోకి వచ్చే నాటికే ప్రియాంకకి స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఇదేదీ నా యాక్టింగ్ కెరియర్‌కు ఉపయోగపడలేదు. కానీ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సాధారణంగా అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలేవీ నేను ఎదుర్కోలేదు. ఇదొక్కటే నాకు లభించిన అడ్వాంటేజ్. ఇక నాతో పాటు పరిణితీ చోప్రా, మన్నారా చోప్రా కూడా ఇండస్ర్టీలోకి వచ్చారు. అదృష్టవశాత్తూ నన్ను ఎవరితో పోల్చలేదు' అని పేర్కొంది. ఇక 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా పలు దక్షిణాది సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మీరా చోప్రా ఆ తర్వాత వాన, ఖిలాడి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ర్టీలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఓ సినిమాలో నటిస్తుంది. చదవండి : ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక నోరు మూస్కో, నా టైమ్ వేస్ట్ చేయకు: తాప్సీ -
అమెజాన్‌లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్‌లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్‌కు ఇచ్చే డ్రగ్‌ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్‌ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్‌కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్‌లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్‌ని విచారించనుంది. -
కేటీఆర్ ఆదేశం: మీరా ఫిర్యాదుపై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హీరోయిన్ మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తున్న 15 ట్విటర్ హ్యాండిల్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అకౌంట్లను ఉపయోగిస్తున్న సభ్యులకు నోటీసులు పంపించారు. అంతేకాకుండా అసభ్యకర ట్వీట్లు చేసిన ఆ 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు) తాజాగా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు ట్విటర్ వేదికగా ఈ నటి ఫిర్యాదు చేశారు. ‘మీ రాష్ట్రానికి చెందిన కొందరు నాపై సామూహిత అత్యాచారం, యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళలకు రక్షణ కల్పిస్తారని, దీనిపై విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్, కవితలకు మీరా చోప్రా ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ చేసిన ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా జతచేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మేడమ్ మీరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్‌శాఖను కోరాను’ అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన మీరా చోప్రా మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని మరోసారి విజ్ఞప్తి చేశారు. (మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా) ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ మీరా చోప్రాకు అండగా నిలిచారు. (ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న నటుడు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 -
మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా
-
మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగైదు రోజులుగా మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై మీరాచోప్రా మరోసారి మంత్రి కేటీఆర్, కవితకు ట్విటర్ ద్వారా ట్వీట్ చేశారు. ' నన్ను గ్యాంగ్ రేప్ చేస్తామని, యాసిడ్ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ఫిర్యాదు చేశాను. మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా' అంటూ తెలిపారు (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 కాగా దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు.' మేడం.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఆదేశించాను.' అంటూ తెలిపారు. కేటీఆర్ ట్వీట్‌కు మీరాచోప్రా రీట్వీట్ చేస్తూ..'థ్యాంక్యూ కేటీఆర్ సార్.. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై నేరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచకూడదు!' అంటూ పేర్కొన్నారు. మీరా చోప్రా ట్వీట్ల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ట్విటర్లో చేసిన అసభ్యకరమైన ట్వీట్లను పోలీసులు తొలగించారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తించి వారిపై 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపై ట్విటర్లో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలుసులు పేర్కొన్నారు. Thanks sir, it really means a lot. This is very important for women safety. These people should not be left free to do crimes on women! 🙏🙏 https://t.co/HzQcRHPEAd — meera chopra (@MeerraChopra) June 5, 2020 అసలు ఏం జరిగిందంటే.. జూన్ 1న మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు
తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం నాడు అభిమానులతో చిట్‌చాట్ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనడంతో ఈ వివాదం రాజుకుంది. తానసలు ఆ హీరో ఫ్యాన్ కాదన్నందుకు ఆమెపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దూషణలకు దిగుతూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె వాటి స్క్రీన్షాట్లను సైబర్ క్రైమ్ పోలీసులకు ట్వీట్ చేసింది. తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ట్వీట్ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు 67 యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద హీరో అభిమానులపై కేసు నమోదు చేశారు. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) This is my main concern. What is stopping these stars to come out and talk abt cyber bullying, slut shaming done by their fan clubs. Is it that they dont care or they have lost spine?? https://t.co/pDF74hUPo6 — meera chopra (@MeerraChopra) June 3, 2020 అసభ్యంగా కామెంట్లు చేసిన వారి ట్విటర్ అకౌంట్లను గుర్తింంచే పనిలో పడ్డారు. అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు. కాగా ఈ ఘటనపై గాయని చిన్మయితో పాటు, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ సైతం మీరా చోప్రాకు మద్దతు పలికారు. మీరా చోప్రాపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ట్విటర్ అకౌంట్లను తొలగించాల్సిందిగా ట్విటర్‌ను కోరారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) 🙏 https://t.co/NA0aLw45Ol — meera chopra (@MeerraChopra) June 3, 2020 -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను దూషించిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులు కావడం దురదృష్టకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొందరు పచ్చిగా తిడుతూ చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు పంపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరా చోప్రా ఫిర్యాదుతో అసభ్య ట్వీట్లను పోలీసులు తొలగించారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు) అంతకుముందు ఎన్టీఆర్‌కు మీరా ట్వీట్ చేస్తూ దీనిపై స్పందించాలని కోరారు. ‘తారక్... నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్ స్టార్ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని మీరా పేర్కొన్నారు. కాగా, తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో మీరా చోప్రా నటించిన విషయం తెలిసిందే. (65 ఏళ్ల వారికి షూటింగ్‌కి అనుమతి లేదు!) Ntr fans tweeting about #gangbang!! And some more abusive tweets @NCWIndia @hydcitypolice @CyberCrimeshyd pic.twitter.com/x6VlC2lKYB — meera chopra (@MeerraChopra) June 2, 2020 @tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl — meera chopra (@MeerraChopra) June 2, 2020 -
జూనియర్ NTR ఫ్యాన్స్‌పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
-
హీరోయిన్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!
తనను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేధిస్తున్నారని హీరోయిన్ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రోజున ట్విటర్ వేదిగా మీరా చోప్రా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. దానికి ఆమె మహేష్‌బాబు అని ఆమె సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించగా.. తను ఆయన ఫ్యాన్ కాదని చెప్పారు. అయితే ఈ సమాధానం చెప్పినందుకు ఎన్టీఆర్ అభిమానులు తనను తీవ్రమైన పదాలతో దూషిస్తున్నారని ఆమె నేడు ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ఇటువంటి అభిమానుల ఫాలోయింగ్‌తో మీరు సక్సెస్ అయినట్టు భావిస్తున్నారా అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. అలాగే ఈ ట్వీట్‌పై ఎన్టీఆర్ స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ‘తారక్... నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్ స్టార్ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని మీరా పేర్కొన్నారు. కాగా, తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు.. వంటి చిత్రాల్లో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు. @tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl — meera chopra (@MeerraChopra) June 2, 2020 -
మా నాన్నను కత్తితో బెదిరించి..
న్యూఢిల్లీ: హీరోయిన్ మీరా చోప్రా తన ట్విటర్ ద్వారా నేరాన్ని వెలుగులోకి తెచ్చారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయారని ఆమె తెలిపారు. వాకింగ్ వెళ్లినప్పుడు ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా బంధువైన మీరా చోప్రా పలు భాషల్లో నటించారు. తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. తాజాగా హిందీలో సెక్షన్ 375 సినిమాలో కీలక పాత్ర పోషించారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తాజా పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక షో కోసం ఏప్రిల్‌లో, ఒక సినిమా కోసం జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాను. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో పరిశ్రమలో ఎవరికీ తెలియదు. నా నిర్మాతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదనిపిస్తోంది. మనం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మనమందరం కలిసి మొదట కరోనాతో పోరాడాలి, తర్వాతే దేని గురించైనా ఆలోచించాలి. ప్రస్తుతం మన మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమ’ని పేర్కొన్నారు. (రోడ్డుపై నోట్లు.. ఒక్కరు ముట్టుకుంటే ఒట్టు!) -
పురుగులున్న ఫుడ్ పంపారు : నటి ఆగ్రహం
ఇటీవల కాలంలో తినే పదార్థాల్లో పురుగులు ఇతర వస్తువులు వస్తున్న సంఘటనలు తరుచూ కనిపిస్తున్నాయి. వంట చేసే ప్రాంతంలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం, నిర్లక్షం కారణంగా అవి తినేవారు జబ్బుల బారిన పడుతున్నారు. తాజాగా నటి మీరా చోప్రాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తెలుగులో బంగారం, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా ప్రస్తుతం బాలీవుడ్లో ‘సెక్షన్ 375’ సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల 23న ఈమె అహ్మదాబాద్‌లోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడే ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే హోటల్ సిబ్బంది పంపిన ఫుడ్‌లో తెల్లటి పురుగులు ఉండటంతో ఆమె షాక్ అయ్యారు. భారీగా డబ్బు తీసుకొని ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరా సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. Staying in @DoubleTree ordered food and got worm in it. @fssaiindia plz have a look. We r paying a bomb to stay in dese places and dey serve us worms in my food. I want some immediate action to be taken on this. Guys lets make this trend and people know!! pic.twitter.com/hGTY6D9ck2 — meera chopra (@MeerraChopra) August 23, 2019 -
శృంగార సన్నివేశాలకు నో..
శృంగార సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని బాలీవుడ్ నటి మీరా చోప్రా చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయిన మీరా చోప్రా తాను శృంగార సన్నివేశాలకు అన్‌ఫిట్ అని స్పష్టం చేసింది. ‘అవునండీ.. శరీరమంతా కనిపించేలా దుస్తులు, స్విమ్మింగ్ సూట్ వంటివి ధరించడం నాకు అంతగా నచ్చదు. నా వరకు నాకు కుటుంబ తరహా పాత్రలనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాను.. అందుకే శృంగార సన్నివేశాలు చేయాల్సి వచ్చే సినిమాలను కూడా తిరస్కరిస్తున్నాను.. ఈ నిర్ణయం నాకు నేను తీసుకున్నదే కాబట్టి మున్ముందు అవకాశాలు తగ్గినా ఇబ్బంది పడను..’ అని చెప్పింది. ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్’ సినిమాలో హీరోయిన్గా చేసిన మీరా చోప్రా భవిష్యత్తులో న్యూయార్క్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నానంది. ‘నేను న్యూయార్క్‌లో ఉండేదాన్ని కాబట్టి అక్కడి విషయాలు గురించి నాకు అవగాహన ఉంది. ఫ్యాషన్ హౌస్ ఏర్పాటు నా చిరకాల వాంఛ.. అందుకే నటనతో పాటు వేరే ఏమైనా చేయాలని నాకు అనిపించినప్పుడు తప్పకుండా న్యూయార్క్‌లో ఫ్యాషన్ వ్యాపారం మొదలుపెడతా’నని చెప్పింది. ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్’ తర్వాత తాను చాలా కథలు వింటున్నానని చెప్పింది. మనసుకు నచ్చిన కథ దొరికిన వెంటనే ఓకే చెబుతానంది. కాగా ప్రస్తుతం ‘1920 లండన్’ అనే చిత్రంలో నటిస్తున్నానని మీరా చోప్రా వివరించింది. ఈ సినిమా భిన్న కథాంశంతో కూడుకున్నదని ఆమె వివరించింది. ఇదిలా ఉండగా మీరాచోప్రా బాలీవుడ్లోనే కాకుండా పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో చేసిన పలు పాత్రలు ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాయి. -
ఆఫర్లకోసం మీరాచోప్రా అగచాట్లు