పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం | Meera Chopra Served Food with Worms, Slams 5 Star Hotel | Sakshi
Sakshi News home page

పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం

Aug 27 2019 11:24 AM | Updated on Aug 27 2019 11:26 AM

Meera Chopra Served Food with Worms, Slams 5 Star Hotel - Sakshi

ఇటీవల కాలంలో తినే పదార్థాల్లో పురుగులు ఇతర వస్తువులు వస్తున్న సంఘటనలు తరుచూ కనిపిస్తున్నాయి. వంట చేసే ప్రాంతంలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం, నిర్లక్షం కారణంగా అవి తినేవారు జబ్బుల బారిన పడుతున్నారు. తాజాగా నటి మీరా చోప్రాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తెలుగులో బంగారం, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సెక్షన్‌ 375’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ నెల 23న ఈమె అహ‍్మదాబాద్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడే ఫుడ్‌ ఆర్డర్ చేశారు. అయితే హోటల్‌ సిబ్బంది పంపిన ఫుడ్‌లో తెల్లటి పురుగులు ఉండటంతో ఆమె షాక్‌ అయ్యారు. భారీగా డబ్బు తీసుకొని ఇలాంటి ఫుడ్‌ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement