అవును నిజమే.. పెళ్లి చేసుకుంటున్నా: బంగారం మూవీ హీరోయిన్‌ | Priyanka Chopra Cousin Meera Chopra To Tie The Knot In February In Rajasthan, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Meera Chopra Marriage: పెళ్లికి రెడీ అంటోన్న స్టార్ హీరోయిన్ కజిన్.. ఎవరో తెలుసా?

Dec 27 2023 3:26 PM | Updated on Dec 27 2023 3:58 PM

Priyanka Chopra Cousin Meera Chopra To Tie The Knot In February - Sakshi

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటికే ప్రముఖ హీరోలు వివాహాబంధంతో ఒక్కటవ్వగా.. బాలీవుడ్‌లో పలువురు తారలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో నటి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం సఫేద్ అనే చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ నటి మీరా చోప్రా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

మీరా చోప్రా మాట్లాడుతూ.. 'అవును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నా. 2024 ఫిబ్రవరి నెలాఖరున నా పెళ్లి జరగనుంది. ఇప్పటికే నా కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నా పెళ్లివేడుక రాజస్థాన్‌లో గ్రాండ్‌గానే జరగనుంది. మా పెళ్లి వేడుకకు 150 మంది అతిథులు హాజరవుతారని' అని మీరా వెల్లడించింది. అయితే పెళ్లి తర్వాత స్నేహితులు, బాలీవుడ్ తారల కోసం ముంబైలో రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. కానీ తనకు కాబోయే భర్త వివరాలు మాత్రం వెల్లడించలేదు.

అయితే ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా మీరా ఒక మిస్టరీ మ్యాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్యార్ వాలా క్రిస్మస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె పెళ్లి గురించి చ‍ర్చ మొదలైంది. అయితే మీరా చోప్రా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్‌ అవుతారు. 

కాగా.. మీరా చోప్రా 2016లో '1920: లండన్'చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించింది. ప్రస్తుతం మీరా  సఫేద్‌ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement