కుర్రాళ్ల హార్ట్‌ బ్రేక్‌ చేయనున్న బంగారం హీరోయిన్‌ | Actress Meera Chopra To Marry A Businessman In Jaipur, Check Marriage Date And Other Details - Sakshi
Sakshi News home page

Meera Chopra Marriage: రకుల్‌ వంతైపోయింది.. నెక్స్ట్‌ బంగారం హీరోయిన్‌..

Published Wed, Feb 21 2024 6:58 PM

Actress Meera Chopra to Marry a Businessman on This Date - Sakshi

మాఘమాసం వచ్చేసింది.. పెళ్లి సంబరాలు తెచ్చేసింది.. ఇప్పటికే ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంలో అడుగుపెడుతుండగా, పలువురూ వారి పెళ్లికి ముహూర్తం పిక్స్‌ చేసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 21న) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి చేసుకోగా తాజాగా మరో బ్యూటీ మీరా చోప్రా వివాహానికి రెడీ అవుతోంది.

ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెడతానని గతంలోనే హింటిచ్చింది. అన్నట్లుగానే మార్చి 11 లేదా 12న జైపూర్‌లో పెళ్లి చేసుకోనుందట! ఇప్పటికే మీరాతో పాటు ఆమె కుటుంబం పెళ్లి పనుల్లో తలమునకలైందట! తన పెళ్లికి 150 మందికిపైగా అతిథులు హాజరవుతారంది మీరా చోప్రా. పెళ్లి తర్వాత సెలబ్రిటీలు, బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌ కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేస్తానంటోంది. ఇకపోతే ఈమె స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక, పరిణీతి చోప్రాకు కజిన్‌ అవుతుంది.

కాగా మీరా చోప్రా 2005లో అన్‌బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బంగారం, మారో, వాన, గ్రీకువీరుడు సినిమాలు చేసింది. ద టాటూ మర్డర్డ్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెట్టింది. ఆమె నటించిన సఫేద్‌ మూవీ ఈ గతేడాది జీ5లో అందుబాటులోకి వచ్చింది.

చదవండి: అనసూయ గ్లామర్‌ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి..

Advertisement
 
Advertisement
 
Advertisement