ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి | Actress Meera Chopra Reveals She Lost Two Very Close Cousins | Sakshi
Sakshi News home page

కోవిడ్‌తో కాదు..సరైన వైద్యం అందక చనిపోయారు : మీరా చోప్రా

May 12 2021 6:56 PM | Updated on May 12 2021 8:33 PM

Actress Meera Chopra Reveals She Lost Two Very Close Cousins - Sakshi

ముంబై : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలా భయంకరంగా ఉందని, దీన్ని అరికట్టకపోతే ఇంకెంత మంది ప్రాణాలు పోతాయో అని నటి మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. 'దాదాపు పది నెలల విరామం తర్వాత షూటింగ్స్‌కు వెళ్తున్నామని ఆనందించేలోపే కరోనా సెకండ్‌ వేవ్‌ ఉప్పెనలా ముంచుకొచ్చింది. కరోనా వైరస్‌ వల్ల నేను పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు కజిన్స్‌ కోల్పోయాను. అయితే వారు కోవిడ్‌ వల్ల చనిపోలేదు. సరైన వైద్యం అందక మరణించారు. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్‌ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్‌ అందక మరొక కజిన్‌ చనిపోయారు. వారు 40 ఏళ్ల వయసువారే. కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది.

వాళ్లను రక్షించుకోలేకపోయాన్న బాధ నన్ను వెంటాడుతుంది. ఈ రెండు ఘటనల తర్వాత  ఎప్పుడు ఎవరకి ఏం జరుగుంతుందో అని అనుక్షణం భయం భయంగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత..ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ ఎదుర్కోలేదు' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి అదుపుతప్పితే చేతులెత్తేసే దుస్థితి నెలకొందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. 

చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా
వివాదాస్పదమైన నటి వ్యాఖ్యలు..అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement