breaking news
cousions
-
ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి
ముంబై : కోవిడ్ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని, దీన్ని అరికట్టకపోతే ఇంకెంత మంది ప్రాణాలు పోతాయో అని నటి మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. 'దాదాపు పది నెలల విరామం తర్వాత షూటింగ్స్‌కు వెళ్తున్నామని ఆనందించేలోపే కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా ముంచుకొచ్చింది. కరోనా వైరస్ వల్ల నేను పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు కజిన్స్ కోల్పోయాను. అయితే వారు కోవిడ్ వల్ల చనిపోలేదు. సరైన వైద్యం అందక మరణించారు. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్ అందక మరొక కజిన్ చనిపోయారు. వారు 40 ఏళ్ల వయసువారే. కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. వాళ్లను రక్షించుకోలేకపోయాన్న బాధ నన్ను వెంటాడుతుంది. ఈ రెండు ఘటనల తర్వాత ఎప్పుడు ఎవరకి ఏం జరుగుంతుందో అని అనుక్షణం భయం భయంగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత..ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ ఎదుర్కోలేదు' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి అదుపుతప్పితే చేతులెత్తేసే దుస్థితి నెలకొందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా వివాదాస్పదమైన నటి వ్యాఖ్యలు..అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ -
చిన్నారుల నిజాయితీ
పుత్తూరు, న్యూస్‌లైన్ : వారు ఆరో తరగతి విద్యార్థులు. రోడ్డున వెళుతుండగా వారికి 15,500 రూపాయలు దొరికాయి. అదే సమయంలో తమ ఉపాధ్యాయులు చెప్పిన నీతి వాక్యాలు గుర్తుకొచ్చాయి. మరో ఆలోచనకు తావు లేకుండా సమీపంలోని పోలీసు వద్దకెళ్లి నగదు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థుల నిజాయితీకి ముగ్ధుడైన సీఐ తన సొంత ఖర్చుతో వారికి కొత్త దుస్తులు కొనిచ్చారు. పుత్తూరు అంబేద్కర్ సర్కిల్లోని పోలీసు సబ్ కంట్రోల్ వద్ద మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నల్లటి కవర్ పడివుంది. దీనిని ఎవరూ గుర్తించలేదు. అదే సమయంలో ఆరో తరగతి విద్యార్థులు లోకేష్, దినేష్ గుడ్‌షెపర్డ్ హాస్టల్ నుంచి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(మెయిన్)కు బయలుదేరారు. వీరు పోలీసు సబ్ కంట్రోల్ రూందాటుతుండగా నల్లటి కవర్ కంట పడింది. అందులో నగదు ఉండడాన్ని గుర్తించారు. నగదున్న కవర్‌ను సమీపంలో విధులు నిర్వహిస్తున్న పీఎస్ఐ రామలక్ష్ముణరెడ్డికి అందించారు. అందులో రూ.15,500 ఉన్నట్లు గుర్తించిన ఆయన సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నగదు నిండ్ర మండలం మిట్టూరు వాసి సుబ్రమణ్యంరెడ్డికి చెందినదిగా గుర్తించారు. తర్వాత పాఠశాల హెడ్ మాస్టర్, విద్యార్థులు లోకేష్, దినేష్‌లను పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలో నగదును సుబ్రమణ్యం రెడ్డికి అందజేశారు. నీతి, నిజాయితీతో మెలగాలని ఉపాధ్యాయులు చెప్పారని, ఆ మేరకే తాము నడుచుకున్నామని విద్యార్థులు తెలిపారు. వీరిని సీఐ చంద్రశేఖర్ అభినందించారు. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తన సొంత డబ్బుతో విద్యార్థులకు దుస్తులు కొనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రవిశంకర్, ప్రధానోపాధ్యాయుడు మునస్వామి, ఏఎస్ఐ రవి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.