ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్! | Bollywood Actress Meera Chopra Gets Married Her Lover In Jaipur | Sakshi
Sakshi News home page

వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బంగారం హీరోయిన్.. !

Mar 12 2024 7:16 PM | Updated on Mar 12 2024 7:28 PM

Bollywood Actress Meera Chopra Gets Married Her Lover In Jaipur - Sakshi

బాలీవుడ్ భామ మీరా చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా తన ప్రియుడు రక్షిత్‌తో ఏడడుగులు వేసింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన మీరా.. ఈ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌కు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మీరా అభిమానులు అభినందనలు చెబుతున్నారు.  ప్రస్తుతం మీరా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తెలుగువారికి సైతం సుపరిచితులైన మీరా.. స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్‌. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. మీరా చోప్రా టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్‌ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్‌ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.కాగా.. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement