‘చికిరి చికిరి...’ అంటూ హుషారైన స్టెప్పులేశారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు.
‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ ఈ పాట సాగుతుంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫోక్ ఎనర్జీ, మోడ్రన్ బీట్స్‌తో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట అదిరిపోతుంది. రామ్‌చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్రేస్, చార్మ్ అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది.


