ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు.
తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్‌తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు కొల్లగొట్టింది.
ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. రెహ్మాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్‌తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు.


