సంవత్సరాంతంలో పర్యటనలను ప్లాన్ చేసుకునే టూరిస్టుల కోసం ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ ‘ట్రావెల్ కా ముహూరత్’ పేరిట సరికొత్త కాన్సెప్ట్ అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా, విమానాలు, హోటల్ వసతులు, హాలిడే ప్యాకేజీలు, గ్రౌండ్ ట్రాన్స్‌పోర్ట్, పర్యటనలు, ఇతర ఆకర్షణీయ సేవలతో పాటు వీసా, ఫారెక్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి ప్రయాణ నిత్యావసరాలను కలిపి ఒకే గొడుగు కింద అందించనుంది.
ఈ విషయాన్ని సంస్థ సీఈఓ రాజేష్ మాగోవ్ తెలిపారు. తమ ‘ట్రావెల్ కా ముహూరత్’ ప్రారంభ ఎడిషన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. సంవత్సరాంతం (డిసెంబర్)లో ఛార్జీలు పెరుగుతాయని భావించే పర్యాటకులు ముందుగా తమ పర్యటనలను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.


