భాగ్యనగరవాసులకు ఆనంద ప్రతిబింబాలు అందించాలనే థీమ్‌తో ఇనార్బిట్ మాల్ రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్ అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా మాల్‌లో ఆకర్షణీయమైన అలంకరణలు, సృజనాత్మక వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్లు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇనార్బిట్ మాల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోపాలని మాట్లాడుతూ.. ఇది కేవలం షాపింగ్ గురించి కాదు, ప్రజలంతా ఒకే సమాజంలో భాగమై, కలిసి ఎదిగి, కలిసి సంబరాలు జరుపుకోవడం గురించిన అంశమని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాల్లో ఇనార్బిట్ అనేక వ్యక్తిగత కథలకు, నవ్వులకు, కుటుంబ సంప్రదాయాలకు వేదికగా మారింది. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్‌తో ఆ భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాల్‌లో ఏర్పాటు చేసిన కళాత్మక ఇన్‌స్టాలేషన్లు, యాక్టివేషన్లు ఆ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూపొందించినట్లు తెలిపారు.


