అక్కడ సౌందర్య చికిత్సలు.. ఇక్కడ పేషెంట్స్‌గా..! | Survey Said Hyderabadis turning to patients for Turkey beauty treatments | Sakshi
Sakshi News home page

Turkey beauty treatments: అక్కడ సౌందర్య చికిత్సలు.. ఇక్కడ పేషెంట్స్‌గా..!

Oct 28 2025 10:10 AM | Updated on Oct 28 2025 11:11 AM

Survey Said Hyderabadis turning to patients for Turkey beauty treatments

ఏదైనా అనుభవంలోకి వస్తేకానీ తెలియదంటారు పెద్దలు.. అలాంటి అనుభవాలు ప్రస్తుతం నగరంలోని సౌందర్య పోషకులకు ఆశాభంగాన్ని కలిగిస్తున్నాయి.. సౌందర్య చికిత్సలకు పేరొందిన టర్కీలో నకిలీ చికిత్సల విజృంభణ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రివిజన్‌ కేసులు కూడా పెరిగాయంటున్నారు హైదరాబాద్‌ నగర వైద్యులు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని శారీరక లోపాలను సవరించుకోవాలని, అందమైన రూపాన్ని అందుకోవాలని ఆశించే కొందరు భాగ్యనగర వాసులకు కేవలం ఆశాభంగం మాత్రమే కాదు చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సౌందర్య చికిత్సలకు పేరొందిన అంతర్జాతీయ గమ్య స్థానం టర్కీకి వెళ్లి వన నగరవాసులకు ఇది అనుభవంలోకి వస్తోంది.     

గత కొంత కాలంగా సరసమైన సౌందర్య చికిత్సలకు కేరాఫ్‌గా ఉన్న టర్కీ.. కోవిడ్‌ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. బ్యూటీ ట్రీట్‌మెంట్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి ఇటీవలి కాలంలో రాకపోకలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టే వ్యూహాత్మక ప్రచారం కూడా ప్రభావం చూపింది. 

ఒక్క 2021లోనే ఆరు లక్షల 70వేల మందికి పైగా విదేశీయులు వైద్య చికిత్స కోసం టర్కీని సందర్శించారని ఆ దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ ఆరోగ్య సేవల ఏజెన్సీ తెలిపింది. ఒక సంవత్సరం తరువాత, ఆ సంఖ్య 1.25 మిలియన్లకు అంటే 88% పెరుగుదల చవి చూసింది. అలాగే 2023 మొదటి ఆరు నెలల్లో, గణాంకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో భారతీయుల వాటా కూడా ఎక్కువే.  

రిటర్న్‌.. రివిజన్‌.. 
చికిత్సల కోసం వెళ్లి టర్కీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచి్చన చాలా మంది నగరవాసులు చికిత్స దుష్ఫలితాలను సరిదిద్దుకోవడానికి నేరుగా సిటీలోని చర్మ నిపుణుల క్లినిక్‌ల వైపు వెళ్తున్నారు. విదేశాల్లో ముఖ్యంగా టర్కీలో – జుట్టు మార్పిడి, ఫేస్‌లిఫ్ట్‌లు, రైనోప్లాస్టీ, టమ్మీ టక్‌ వంటివి విఫలమైన తర్వాత ‘రివిజన్‌ కేసులు’ గణనీయంగా పెరుగుతున్నాయని నగర వైద్యులు చెబుతున్నారు. కనుబొమ్మ, బుగ్గ లిఫ్ట్‌ కోసం టరర్కీకి ప్రయాణించిన 49 ఏళ్ల నగర మహిళ ముఖ కవళికలు మారిపోవడంతో పాటు తల మీద ఇన్ఫెక్షన్‌తో బాధపడింది. 

‘అక్కడ చికిత్స సందర్భంగా మరచిపోయిన కుట్ల వల్ల దీర్ఘకాలిక గాయం ఏర్పడింది’ అని ఆ తరువాత రోగికి చికిత్స చేసిన నగరానికి చెందిన ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ డి.అక్షిత రావు చెబుతున్నారు. 
నియంత్రణ లోపం.. 

ఆకర్షణీయ ప్యాకేజీలు.. 
దేశం నుంచి రోగులను ఆకర్షించడానికి వ్యూహాత్మక కాస్మెటిక్‌ ప్యాకేజీలను ప్రకటించింది. గతంలో ఇటువంటి ప్రక్రియల కోసం నగరం నుంచి అమెరికా, యూరప్‌లకు వెళ్లేవారు. అక్కడ రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల (లేదా అంతకంటే ఎక్కువ) మధ్య చెల్లించాల్సి వచ్చేది. అయితే టర్కీ ప్రచార ప్రభావంతో చికిత్సార్థులు టర్కీ వైపు మొగ్గు చూపారు. అక్కడ అదే ప్రక్రియ రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలలోనే లభిస్తుండడం దీనికి కారణ

సరైన నియంత్రణ లేకపోవడం వల్ల అనేక టర్కిష్‌ క్లినిక్‌లు లోపభూయిష్ట చికిత్సా విధానాలను అనుసరిస్తున్నాయని నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కిరణ్‌ బండా పేర్కొన్నారు. ‘అక్కడ చికిత్సలను తరచూ సర్టీఫైడ్‌ వైద్యులు కాకుండా అర్హత లేని సాంకేతిక నిపుణులు నిర్వహిస్తారు’ అని ఆయన ఆరోపించారు. 

చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత, తమకు ఎటువంటి సరైన సహకారం అందడం లేదని కూడా చెబుతున్నారు. సోషల్‌ మీడియా టర్కీ డిమాండ్‌ను పెంచుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షించడానికి క్లినిక్‌లు వాట్సాప్‌ సందేశాలను పంపుతూ ప్రచారం చేస్తున్నారు. ‘టర్కీ నుంచి ముందు–తర్వాత ఫలితాలను ప్రదర్శించే ఇన్‌ఫ్లుయెన్సర్‌ పోస్ట్‌లు డిమాండ్‌ సృష్టిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా.. 
టర్కీలో నిర్వహించే కాస్మెటిక్‌ సర్జరీ వల్ల కలిగే సమస్యల గురించి జర్మనీ ప్రజారోగ్యసంస్థ, రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ టర్కీలో బొటాక్స్‌ ఉదర చికిత్స తర్వాత దాదాపు 27 మంది  రోగుల్లో కండరాల బలహీనత, అస్పష్టమైన దృష్టి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్నిసార్లు పక్షవాతం వంటి తీవ్రమైన దు్రష్ఫభావాలను సైతం కలిగించిందని వెల్లడించింది. 

అలాగే గత జనవరిలో బ్రిటన్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి బట్‌ లిఫ్ట్‌ కాస్మెటిక్‌ సర్జరీ కోసం ఇస్తాంబుల్‌కు వెళ్లి నాలుగు రోజుల తర్వాత ప్రాణాంతక గుండెపోటుకు గురయ్యారని బ్రిటిష్‌ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ధర కన్నా నాణ్యత, ఆరోగ్య భద్రతకు మాత్రమే నగరవాసులు ప్రాధాన్యత ఇవ్వాలని నగర వైద్యులు సలహా ఇస్తున్నారు. 

టర్కీలో చికిత్స పొందేందుకు ఆసక్తి ఉన్న ఎవరైనా వైద్యుల అర్హతలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, యూరోపియన్‌ ప్రమాణాల ప్రకారం వైద్యుడు లేదా క్లినిక్‌ థృవీకరణ ఉందా? లేదా! అని తనిఖీ చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.   

(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్‌ టెక్నిక్స్‌ ఫాలో అవ్వాల్సిందే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement