బరువు తగ్గే టాస్క్‌ని చాలా సింపుల్‌గా స్మార్ట్‌గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..
ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్‌కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్‌గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె.
అందుకోసం డెడికేషన్‌తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్‌ఫుడ్‌ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్‌ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్.
నేచురల్‌గా సన్నగా మారడం కోసం..
సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట.
మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె.
భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె.
చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్‌మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్‌ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది.
అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె.
అవేంటంటే..
అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్
కృత్రిమ చక్కెర
వారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణ
ప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది.
ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్‌తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్‌గా రూబీ డైమండ్ నెక్లెస్..)


