ఏడాది మొత్తం ఒకెత్తయితే.. సంవత్సరాంతపు నెల ఒక్కటీ ఒకెత్తు అంటారు సంగీత ప్రియులు. ఓ వైపు చల్లనిగాలులు.. మరోవైపు సంగీత సరాగాలు.. రెంటి మేలి కలయికలో భాగ్యనగరవాసుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే మాసం ఇది. ఈ మ్యూజిక్ కిక్‌కు పరాకాష్ట అన్నట్లు డిసెంబర్ నెలలో.. సంవత్సరాంతంలో న్యూ ఇయర్ హంగామా ఉండనే ఉంది. ఈ మధ్యలో క్రిస్మస్ సందడి ఎలాగో ఉండనే ఉంది.. నెల మొత్తం వివిధ రకాల ఈవెంట్లతో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రానున్న సంగీత సందడికి సిద్ధమవుతున్న మ్యూజిక్ లవర్స్‌ను అలరించేందుకు తరలివస్తున్న సుస్వరాల వివరాలు, విశేషాల సమాహారం ఇది..
సంవత్సరాంతంలో భాగంగా నగరంలో పలు సంగీత కార్యక్రమాలు అలరించనున్నాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ వాటిలో ఒకటి జాకీర్ నీలాద్రి ప్రదర్శన. ఆయన ప్రదర్శనలో అత్యంత ఆకర్షణీయమైన అంశం.. అనేక మంది సంగీత ప్రియులు కోరుకునే సితార్, తబలా మేళవింపు. నగరంలోని శిల్పకళావేదికపై ఈ నెల 7న నీలాద్రికుమార్ తన సంగీత ప్రదర్శన అందిస్తున్నారు. నీలాద్రి కుమార్ నాలుగు సంవత్సరాల వయసు నుంచి తన గురువు, తండ్రి పండిట్ కార్తీక్ కుమార్ దగ్గర శిక్షణ పొందిన ఐదో తరం సితార్ వాద్యకారుడు ఒక ట్రైల్‌బ్లేజర్‌గా, నీలాద్రి కుమార్ ‘జితార్’ (ఎలక్ట్రిక్ సితార్)ను ఆవిష్కరించారు.
ఎల్రక్టానిక్.. మ్యూజిక్ కిక్..
సిటిజనుల్ని ఆకట్టుకునే మరో ఈవెంట్.. ఇండో వేర్‌హౌస్ ఇండియా టూర్. ఇది దక్షిణాసియా మూలాలు ప్రపంచ ఎల్రక్టానిక్ శబ్దాలను కలిపే ఒక వినూత్న అనుభవం. న్యూయార్క్, లండన్, దుబాయ్‌లో విజయవంతమైన వేడుకల తర్వాత, ఇండో వేర్‌హౌస్ ముంబై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్‌లకు తరలివస్తోంది. ఈ నెల 21న మాదాపూర్‌లోని క్వేక్ ఎరీనా వేదికగా రాత్రి 8గంటల నుంచి 5గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనిని కహానీ, కునాల్ మర్చంట్ సమరి్పస్తారు.
ఇదిగో.. డిస్కోగ్రఫీ..
ఢిల్లీకి చెందిన గాయకుడు, గీత రచయిత ఆదిత్య రిఖారి. తనదైన శైలి డిస్కోగ్రఫీ యువత కేంద్రీకృత, ఇండీ–పాప్ శైలికి విస్తరించింది. మాదాపూర్‌లోని క్వేక్ అరీనాలో ఈ నెల 12న రాత్రి 7గంటల నుంచి 5గంటల పాటు ఈ ఇండీపాప్ సంగీత కార్యక్రమం సందడి చేయనుంది.
లెబనాన్.. మ్యూజిక్ తుఫాన్..
లెబనాన్‌కు చెందిన అత్యుత్తమ పెర్క్యుషనిస్ట్.. రోడోల్ఫ్ మనౌకియన్, తన పవర్ ఫుల్ సంగీత ప్రదర్శనను అందిస్తున్నారు. ఈ నెల 3, 6 తేదీల్లో నానక్‌రామ్ గూడలోని స్టూడియో జో బార్‌లో రాత్రి 8గంటల నుంచి 2గంటల పాటు ఆయన ఈవెంట్ ఉంటుంది. సంప్రదాయ మధ్యప్రాచ్య లయలను ఆఫ్రో, ట్రైబల్, ఎలక్ట్రానిక్ బీట్‌లతో మేళవించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు.
విను..విలేన్..
శక్తివంతమైన సాహిత్యం, ముడి భావోద్వేగాలు మరపురాని సంగీతంతో నిండిన సాయంత్రం కోసం విలేన్ రెడీ అవుతున్నాడు. అతను అత్యంత ప్రియమైన హిట్ పాటలైన ‘ఏక్ రాత్,’ ‘రావణ్,’ ‘చిడియా’లను ప్రదర్శిస్తాడు. ఈ నెల 5, 13 తేదీల్లో రాత్రి 8.30గంటల నుంచి స్టూడియో జో బార్‌లో బాలీవుడ్ బీట్స్‌కి పేరొందిన ఆయన సంగీత కార్యక్రమం అలరించనుంది.
అనూప్..స్టైల్..
ప్రముఖ ఉత్తరాది గాయకుడు అనూప్ శంకర్ సంగీత కార్యక్రమం ఈ నెల 6న నగరంలోని క్వేక్ అరీనాలో ఉంటుంది. రాత్రి గంటల నుంచి 5గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో అనూప్ బాలీవుడ్ పాటలతో అలరించనున్నారు.
లిజన్.. చెమ్మీన్..
ఈ నెల 6న కేరళకు చెందిన చెమ్మీన్ బ్యాండ్ లైవ్ నగరంలోని ఓడియం బై ప్రిజమ్‌లో ఉంటుంది. సంప్రదాయ సమకాలీన స్వరాల ప్రత్యేక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందిందీ చెమ్మీన్ బ్యాండ్.
స్విఫ్ట్ కోసం..
ప్రముఖ గాయని, పాటల రచయిత టేలర్ స్విఫ్ట్ జర్నీ.. తన 14 సంవత్సరాల వయసులో కంట్రీ సింగర్‌గా ప్రారంభమైంది. ఆమె తొలి ఆల్బమ్ చీటేలర్ స్విఫ్ట్ చీ బిల్‌బోర్డ్ టాప్ 200లో టాప్ ఫైవ్‌లో ఒకటి. ఈ నెల 13, 27 తేదీల్లో ది ఎరాస్ నైట్ పేరిట నగరంలోని మకావ్ కిచెన్‌లో ఆమె సంగీతానికి కృతజ్ఞతగా అభిమానులు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.
(చదవండి: ఇండియన్.. కొరియన్.. ఓ సినిమా కథ..)


